ఉల్లిపొట్టు పడేయకండి!
కడిగిన ఉల్లిపొట్టును సన్నటి సెగమీద పావుగంట ఉడికించి, వడకట్టి ఆ నీటిని పడుకోబోయే ముందు తాగితే హాయిగా నిద్రపడుతుంది. కాళ్లు తిమ్మిరెక్కడం తగ్గుతుంది...
మామూలుగా ఉల్లిపొట్టును చెత్తలో పడేస్తాం. కానీ దానివల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసుకుంటే ఇకపై భద్రంగా ఉంచుతాం.
కడిగిన ఉల్లిపొట్టును సన్నటి సెగమీద పావుగంట ఉడికించి, వడకట్టి ఆ నీటిని పడుకోబోయే ముందు తాగితే హాయిగా నిద్రపడుతుంది. కాళ్లు తిమ్మిరెక్కడం తగ్గుతుంది.
* ఉల్లిపొట్టును కుక్కర్‌లో ఉడికించి వడకట్టి ఆ నీటిని జుట్టు కుదుళ్లకు పట్టించి అరగంట తర్వాత తలంటుకుంటే కురులు దృఢంగా ఉంటాయి. తరచూ ఇలా చేస్తే రాగిరంగు డై వేసుకున్నట్టు మారుతుంది కూడా.
* ఉల్లిపొట్టుని మొక్కల్లో వేస్తే ఎరువుగా ఉపయోగపడుతుంది. దీన్ని డబ్బాలో వేసి నీళ్లు పోసి మూతపెట్టి ఏడు రోజుల తర్వాత ఆ నీటిని మొక్కలకు జల్లితే తెగుళ్లు సోకవు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.