30 దాటిందా... ఎముకలు జాగ్రత్త

మహిళల్లో 30 ఏళ్లు దాటిన తర్వాత ఎముకలుబలహీనమవుతూ ఉంటాయి. కాబట్టి ఈ సమయంలో ఆహారం మీద శ్రద్ధ పెట్టాలి...

Published : 24 Jun 2021 01:27 IST

మహిళల్లో 30 ఏళ్లు దాటిన తర్వాత ఎముకలుబలహీనమవుతూ ఉంటాయి. కాబట్టి ఈ సమయంలో ఆహారం మీద శ్రద్ధ పెట్టాలి...

పాల ఉత్పత్తులు... పాలు, పెరుగు, చీజ్‌... లాంటి పాల ఉత్పత్తుల నుంచి క్యాల్షియం, ప్రొటీన్‌, విటమిన్‌-డి లభిస్తాయి. ఇవి ఎముకలు బలంగా ఉండేందుకు సాయపడతాయి. వీటితో పొట్ట నిండినట్టయ్యి చాలాసేపటి వరకు ఆకలి వేయదు. బరువు పెరుగుతామనే భయమూ ఉండదు.

చిరుధాన్యాలు... అత్యావశ్యక పోషకాలు, పీచు... లాంటివి గోధుమ, జొన్న, రాగులు, బ్రౌన్‌రైస్‌లలో మెండుగా ఉంటాయి. ఎముక ఆరోగ్యాన్ని పెంచడంతోపాటు రోగనిరోధక శక్తినీ అందిస్తాయి.

గుడ్లు... మాంసకృత్తులు మెండుగా ఉంటాయి.  కండరాలు, ఎముకలను బలంగా మారుస్తాయి. అలసట, నిస్సత్తువ లాంటివి దరిచేరకుండా ఎప్పుడూ ఉత్సాహంగా ఉండేలా చేస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్