పాదరక్షలు ఎంచుకోండిలా

వానాకాలంలో కాలిని పూర్తిగా కప్పేసే బూట్లు, చెప్పులకు దూరంగా ఉండాలి. వీటితో వానలో తడిస్తే ఇబ్బందే. నీటిని పీల్చుకుని బరువుగా మారతాయి. త్వరగా ఆరవు. దాంతో వాటిలో సూక్ష్మ జీవులు

Published : 24 Jun 2021 01:27 IST

వానాకాలంలో కాలిని పూర్తిగా కప్పేసే బూట్లు, చెప్పులకు దూరంగా ఉండాలి. వీటితో వానలో తడిస్తే ఇబ్బందే. నీటిని పీల్చుకుని బరువుగా మారతాయి. త్వరగా ఆరవు. దాంతో వాటిలో సూక్ష్మ జీవులు ఆవాసం ఏర్పరుచు కుంటాయిక్కడ. ఈ కాలంలో చెప్పుల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కాళ్లకు రక్షణతోపాటు అందంగా, సౌకర్యవంతంగా ఉండేలా చూసుకోవాలి. స్టైలిష్‌గా ఉండటమూ తప్పనిసరి. మరి అలాంటి వాటిని ఎలా ఎంచుకోవాలి?

ఫ్లిప్‌ఫ్లాప్స్‌... ఈ కాలంలో ఫ్లిప్‌ఫ్లాప్స్‌ చక్కటి ఎంపిక. వీటిపై నీళ్లు నిలిచి ఉండవు. త్వరగా ఆరిపోతాయి.

శాండిల్స్‌:  తడిచినా త్వరగా ఆరిపోతాయి. ఇబ్బంది పెట్టవు. స్ట్రాప్స్‌ను పెట్టి, తీయడం కూడా సులువే.

క్లాగ్స్‌...  వీటికి ఉండే రంధ్రాల  వల్ల ఇవి ఎప్పుడూ పొడిగానే ఉంటాయి. తేలికగానూ, వాటర్‌ ప్రూఫ్‌గానూ ఉంటాయి. సౌకర్యంతోపాటు స్టైలిష్‌గానూ కనిపిస్తాయి.

* ఈ కాలంలో తడిచిన చెప్పులు, బూట్లు ఆరడానికి సమయం పడుతుంది. అప్పుడు వాటి నుంచి దుర్వాసన వెలువడే ప్రమాదం ఉంది. అలా కాకుండా వోడర్‌ రెసిస్టెంట్‌ రకాలను ఎంచుకుంటే మేలు.

* వాటర్‌ ప్రూఫ్‌ రకాలు.. తేలికగా ఉండే మన్నికైన వాటర్‌ప్రూఫ్‌ పాద రక్షలను తీసుకోవాలి. ఎందుకంటే వీటిని సులువుగా శుభ్రం చేసి ఆరబెట్టొచ్చు కూడా.

* రబ్బరు సోల్‌ ఉండే బూట్ల రకాలను ఎంచుకుంటే సరి. ఇవి వాటర్‌ప్రూఫ్‌గానూ ఉండి నీటిని నిలవనీయవు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్