జ్ఞాపకాలు.. అపురూపంగా!

జీవితంలో గుర్తుండిపోయే సందర్భాలను ఫొటో రూపంలో భద్రపరుచుకుంటుంటాం. ఇలాంటి వాటికి కొత్త రూపం ఇద్దామనుకుంది సూర్య సీజీ. వస్త్రంపై 3డీ పరిజ్ఞానాన్ని ఉపయోగించి సందర్భానికి తగ్గట్టుగా

Published : 24 Jun 2021 01:27 IST

జీవితంలో గుర్తుండిపోయే సందర్భాలను ఫొటో రూపంలో భద్రపరుచుకుంటుంటాం. ఇలాంటి వాటికి కొత్త రూపం ఇద్దామనుకుంది సూర్య సీజీ. వస్త్రంపై 3డీ పరిజ్ఞానాన్ని ఉపయోగించి సందర్భానికి తగ్గట్టుగా ఎంబ్రాయిడరీ చేస్తోంది. హూప్‌ (ఎంబ్రాయిడరీ చేసే వస్త్రాన్ని పట్టి ఉంచే పరికరం)నే ఫ్రేమ్‌లా చేసి, అందిస్తోంది. మొదటిసారి తన భర్త కోసం ప్రయత్నించింది. ఆయన మెచ్చుకోవడంతో కొనసాగించింది. ఒత్తిడిని తగ్గించుకోవడానికీ మంచి మార్గమైంది. వీటిని సోషల్‌ మీడియాలో పంచుకునేది. తమకూ చేసివ్వమని చాలామంది కోరడంతో దాన్నే ఇప్పుడు వ్యాపారంగా మలచుకుంది. ఫెయిరీ మార్క్స్‌ పేరిట సోషల్‌ మీడియా వేదికగా కొంత మొత్తం తీసుకుని చేసిస్తోందీ కేరళ అమ్మాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్