నగలకు వెనిగర్‌!

రాళ్లున్న దుద్దులు, ఉంగరాలు లాంటి రోజూ ధరించే బంగారు నగలను తరచూ శుభ్రం చేస్తూ ఉండాలి. లేదంటే మురికి పట్టి మెరుపును కోల్పోతాయి. మరి ఎలా శుభ్రం చేయాలో చూద్దామా...

Published : 21 Jul 2021 00:20 IST

రాళ్లున్న దుద్దులు, ఉంగరాలు లాంటి రోజూ ధరించే బంగారు నగలను తరచూ శుభ్రం చేస్తూ ఉండాలి. లేదంటే మురికి పట్టి మెరుపును కోల్పోతాయి. మరి ఎలా శుభ్రం చేయాలో చూద్దామా...
ఓ సీసాను తీసుకుని దాంట్లో మీ బంగారు ఆభరణాలను వేయాలి. ఆ తర్వాత అర కప్పు వెనిగర్‌ పోయాలి. మూడునాలుగు చుక్కల టీట్రీ ఆయిల్‌నూ జత చేసి సీసాను కాస్త కుదిపి అయిదారు గంటలపాటు పక్కన పెట్టాలి. ఇలా చేస్తే నగలకు పట్టిన మురికి అంతా మెల్లిగా సీసా అడుగుభాగంలోకి చేరుతుంది. ఇప్పుడు వస్తువులను బయటకు తీసి వాటిపై కాస్తంత వంటసోడా చల్లి పాత టూత్‌ బ్రష్‌తో మృదువుగా రుద్ది, నీటితో కడిగేయాలి. ఇలా చేస్తే మురికి తొలగిపోవడమే కాదు వాటిపై ఉండే సూక్ష్మజీవులూ చనిపోతాయి.



ఫ్రెంచ్‌ఫ్రైస్‌ని బేక్‌ చేసినా.. నూనెలో వేయించినా.. అవి కరకరలాడేలా రావాలంటే వాటిని వేయించేముందు అరగంటసేపు చన్నీళ్లలో ఉంచండి.




వర్షాకాలం వంటనూనె పాడయ్యే అవకాశముంది. లేదా వాసన మారుతుంది. అలా జరక్కుండా ఉండాలంటే నూనెలో కొన్ని చుక్కలు ఆముదం కలపండి.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్