షాంపూతో ఇవి కలిపి...

ఆరోగ్యంగా మెరిసిపోయే జుట్టు కావాలి. కానీ హెయిర్‌ప్యాక్‌లు వేసుకునే తీరిక లేదు... ఏదో దొరికిన షాంపూతో తలరుద్దుకుంటాం అంటారా! అయితే మీ షాంపూలో వీటిని కలిపి చూడండి. తక్కువ సమయంలో ఎక్కువ ఫలితాలని పొందొచ్చు...షాంపూలో కొద్దిగా తేనె కలిపి చూడండి. జుట్టుకి తేమ అంది నిగనిగలాడుతూ ఉంటుంది....

Updated : 14 Sep 2021 12:34 IST

ఆరోగ్యంగా మెరిసిపోయే జుట్టు కావాలి. కానీ హెయిర్‌ప్యాక్‌లు వేసుకునే తీరిక లేదు... ఏదో దొరికిన షాంపూతో తలరుద్దుకుంటాం అంటారా! అయితే మీ షాంపూలో వీటిని కలిపి చూడండి. తక్కువ సమయంలో ఎక్కువ ఫలితాలని పొందొచ్చు...

షాంపూలో కొద్దిగా తేనె కలిపి చూడండి. జుట్టుకి తేమ అంది నిగనిగలాడుతూ ఉంటుంది.

షాంపూ నీటిలో నిమ్మరసం కలిపితే... చుండ్రు సమస్య తగ్గుముఖం పడుతుంది.

అలొవెరా జుట్టుకీ, చర్మానికీ మేలు చేస్తుందని తెలిసిందే కదా. ఆ జెల్‌ని షాంపూతో కలిపి వాడి చూడండి. జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.

గులాబీ నీటిని కలిపితే శిరోజాలకీ, మాడుకీ కూడా మంచిది.

కొద్దిగా ఆముదం లేదా కొబ్బరినూనె జోడించండి. జుట్టు మొదళ్లు బలంగా మారతాయి.

చిక్కని కొబ్బరిపాలతో కలిపి షాంపూని వాడితే చిట్లి, జీవం లేకుండా ఉన్న శిరోజాలు బాగుపడి ఆరోగ్యంగా, మెరుస్తూ ఉంటాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని