స్వీయ నియంత్రణ నేర్పాల్సిందే...

రేణుక ఎనిమిదేళ్ల కూతురు కోపం వచ్చినప్పుడల్లా చేతిలో వస్తువును విసిరేస్తోంది. ఎందుకిలా మారిందో తెలియక రేణుక ఆందోళనకు గురవుతోంది. స్వీయ నియంత్రణ లేని చిన్నారులు ఇలా ప్రవర్తిస్తా రంటున్నారు మానసిక నిపుణులు.

Updated : 23 Sep 2021 03:26 IST

రేణుక ఎనిమిదేళ్ల కూతురు కోపం వచ్చినప్పుడల్లా చేతిలో వస్తువును విసిరేస్తోంది. ఎందుకిలా మారిందో తెలియక రేణుక ఆందోళనకు గురవుతోంది. స్వీయ నియంత్రణ లేని చిన్నారులు ఇలా ప్రవర్తిస్తా రంటున్నారు మానసిక నిపుణులు.

భావోద్వేగంగా వద్దు...  పిల్లలెదుట తల్లిదండ్రులు, ఇంట్లోని పెద్దవాళ్లు ఎక్కువగా భావోద్వేగాలను ప్రదర్శించకూడదు. సంతోషకరమైన సందర్భమైతే చిన్నారులు ఆస్వాదిస్తారు. కోపోద్రేకాలు వారిని తీవ్ర ఒత్తిడికి గురి చేస్తాయి. ఆ భావాన్ని, ఆలోచనను జీర్ణించు కోలేరు. అది కోపంగా మారే అవకాశం ఎక్కువ. తెలియకుండా ఉన్న ఈ ఆందోళనే ఉద్రేకంగా మారుతుంది. అప్పుడు వారి ప్రవర్తన వారికే అర్థంకాదు. చేతిలోని వస్తువు విసిరేయడం, కోపంగా అరవడం వంటి వన్నీ చేస్తారు.

మృదువుగా... చిన్నారుల ప్రవర్తనలో తేడాను గుర్తించకుండా వారిని దండించినా, కోప్పడినా ఆ ప్రవర్తన మరింత జఠిలమవుతుంది. ఇంట్లో వాతావరణం ప్రశాంతంగా ఉండేలా జాగ్రత్త పడాలి. తల్లిదండ్రులు కోపాన్ని నియంత్రించు కోగలగాలి. పిల్లలెదుట కాకుండా వారు లేని సమయంలో ఆ సమస్యలను పరిష్కరించుకోవడం అలవాటు చేసుకోవాలి. చిన్నారులతో మృదువుగా వ్యవహరించాలి. చదువుకునేటప్పుడు కొంత విరామం అడిగితే కాదనకుండా విశ్రాంతి తీసుకోనివ్వాలి. దాని వల్ల మిగిలిన పనిని తర్వాత తప్పకుండా పూర్తి చేస్తే చిన్న చిన్న కానుకలను అందించాలి. అందరం కలిసి ఎక్కడికైనా వెళ్దామని లేదా కొత్త మొక్కలను కొనిపెడతామని చెప్పాలి. అందరూ కలిసి క్యారమ్‌, చెెస్‌ వంటి ఇండోర్‌గేమ్స్‌ ఆడుతూ వారినీ ఆహ్వానించాలి. ఇవన్నీ వారిలో ఉత్సాహాన్ని, సంతోషాన్ని నింపుతాయి. మనసులో నిగూఢంగా ఉండే కోపం క్రమంగా తగ్గు ముఖం పట్టడమే కాదు, కోపం వచ్చినా దాన్ని నియంత్రించుకునే తత్వం అలవడుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్