చపాతీ పిండి మృదువుగా ఉండాలంటే...

రోజువారీ ఆహారంలో చపాతీ తప్పనిసరిగా మారింది. ఏదో ఒకపూట దీన్ని తీసుకుంటూనే ఉంటాం.  మరి చపాతీ పిండి తయారీలో పాటించాల్సిన మెలకువలేంటో, ఎలా చేస్తే చపాతీలు మృదువుగా వస్తాయో తెలుసుకుందామా...

Updated : 18 Nov 2021 04:47 IST

రోజువారీ ఆహారంలో చపాతీ తప్పనిసరిగా మారింది. ఏదో ఒకపూట దీన్ని తీసుకుంటూనే ఉంటాం.  మరి చపాతీ పిండి తయారీలో పాటించాల్సిన మెలకువలేంటో, ఎలా చేస్తే చపాతీలు మృదువుగా వస్తాయో తెలుసుకుందామా...

ఎక్కువగా నీళ్లు వాడొద్దు... చపాతీ పిండి కలిపేటప్పుడు అది మృదువుగా రావడం కోసం ఎక్కువ నీళ్లు కలపొద్దు. ఇలా చేస్తే పిండి మూతకు, చేసేటప్పుడు పీటకు, చేతులకు అతుక్కుపోతుంది. కాబట్టి పిండి తడిపేటప్పుడు వీలైనంత తక్కువ నీటిని వాడండి. ఒకవేళ పిండి మరీ మెత్తగా అయిపోయి చేతులకు అంటుకుంటూ ఉంటే కాస్తంత పొడి పిండి కలిపితే సరి.

కాస్త నూనె చాలు... పిండి తడిపే సమయంలో లేదా పూర్తిగా తడిపిన తర్వాత అందులో కొద్దిగా నూనె/నెయ్యి వేసి మరోసారి బాగా కలపాలి. ఇలా చేస్తే చపాతీలు ఎక్కువ సమయంపాటు మృదువుగా ఉంటాయి.

గోరువెచ్చని నీళ్లు లేదా పాలు... చపాతీ పిండి తడపడానికి గోరువెచ్చని నీళ్లు లేదా పాలు అందుబాటులో ఉంటే వాటినీ వాడుకోవచ్చు. వీటితో పిండిని కలిపి పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇలా చేస్తే చపాతీలు మృదువుగా వస్తాయి.

గాలి చొరబడని డబ్బాలో.. తయారుచేసి పెట్టుకున్న చపాతీ పిండిని ఫ్రిజ్‌లో భద్రపరిచే సమయంలో తప్పనిసరిగా మూత పెట్టాలి. లేదంటే పిండి పాడైపోతుంది.

ఇవి వాడాల్సిందే..  పిండి పూర్తిగా తడిపిన తర్వాత దానిపై కొద్దిగా నూనె/నెయ్యి పోసి పొరలా రాయాలి. ఇలా చేస్తే పిండి ఎండిపోదు, పాడవదు. ఈ పిండిని ఫ్రిజ్‌లో నిల్వ చేసుకుంటే సరిపోతుంది. అంతేకాదు పిండి తీసుకున్న ప్రతిసారి దాని మీద అల్యూమినియం ఫాయిల్‌ని కప్పి గాలి చొరబడని డబ్బాలో భద్రపరచడం మరవొద్దు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్