అమ్మ చెప్పింది!

వయసుతో సంబంధం లేకుండా ఎప్పుడూ ఒకేలా కనిపించే మ్యాజిక్‌ అందం నటి శ్రియాశరణ్‌ది. ఇలా అందాన్ని కాపాడుకోవడానికి తను పెద్దగా ఖర్చుపెట్టదట. సింపుల్‌గా అందరికీ దొరికే వస్తువులతోనే ఇలా మెరిసిపోతున్నా అంటోంది శ్రియ. ఇంకా ఏమంటోందంటే..

Updated : 19 Dec 2021 05:00 IST

వయసుతో సంబంధం లేకుండా ఎప్పుడూ ఒకేలా కనిపించే మ్యాజిక్‌ అందం నటి శ్రియాశరణ్‌ది. ఇలా అందాన్ని కాపాడుకోవడానికి తను పెద్దగా ఖర్చుపెట్టదట. సింపుల్‌గా అందరికీ దొరికే వస్తువులతోనే ఇలా మెరిసిపోతున్నా అంటోంది శ్రియ. ఇంకా ఏమంటోందంటే..

‘‘నమ్ముతారో లేదో... రోజ్‌వాటర్‌, సెనగపిండి ఇవే నా అందానికి కారణం. ఎక్కడకు వెళ్లినా... రోజ్‌వాటర్‌ బాటిల్‌ నాకూడా ఉండాల్సిందే. అలసిపోయినట్టుగా అనిపించినా, అప్పటికప్పుడు క్షణాల్లో తాజాదనంతో మెరిసిపోవాలన్నా రోజ్‌వాటర్‌ని స్ప్రే చేసుకుంటా. ఎప్పుడైనా ముఖానికి మాయిశ్చరైజర్‌ రాయాల్సిన అవసరం ఉందనిపిస్తే వెంటనే రోజ్‌వాటర్‌కి కాసింత గ్లిజరిన్‌ కలిపి స్ప్రే చేస్తానంతే. వారానికోసారి సెనగపిండిలో పెరుగు కలిపి ముఖానికి పట్టిస్తా. ఇది మా అమ్మ చెప్పిన బ్యూటీ సీక్రెట్‌. అంతకు మించి నేనేమీ చేయను. ఇక మేకప్‌ అంటారా? ఐలైనర్‌, కాజల్‌ లేకుండా బయటకు వెళ్లను. ఇప్పటికీ నాకు శక్తినీ, ఉత్సాహాన్నీ ఇచ్చే వర్కవుట్‌ అయ్యంగార్‌ యోగానే. మనసుని ధృడంగా ఉంచేందుకు యోగాను మించిన వ్యాయామం లేదనేది నా నమ్మకం.’’

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని