రంగు పడదిక!

గోళ్లకు రంగు తీరికగా... జాగ్రత్తగా వేసుకుంటాం... అయినా అప్పుడప్పుడూ అది గోరుతోపాటు చుట్టుపక్కల కూడా అంటుతుంది. దీన్ని తొలగించడం కాస్త ఇబ్బందే. అలానే ఉంచుకుంటే గోళ్ల అందం పోతుంది.

Updated : 21 Dec 2021 12:38 IST

గోళ్లకు రంగు తీరికగా... జాగ్రత్తగా వేసుకుంటాం... అయినా అప్పుడప్పుడూ అది గోరుతోపాటు చుట్టుపక్కల కూడా అంటుతుంది. దీన్ని తొలగించడం కాస్త ఇబ్బందే. అలానే ఉంచుకుంటే గోళ్ల అందం పోతుంది. అలా కాకుండా రంగు కేవలం నెయిల్స్‌కు మాత్రమే వేసుకునేందుకు ఈ నెయిల్‌ క్యాప్స్‌ ఉపయోగపడతాయి. మీరు చేయాల్సిదల్లా నెయిల్‌ క్లిప్స్‌ను చేతి వేళ్లకు చక్కగా పెట్టుకోవాలి. ఇప్పుడు నచ్చిన గోళ్ల రంగును వేసుకోండి. అదనపు రంగు పడిన ఈ క్లాంప్స్‌ను ఆరిన తర్వాత తీసేస్తే సరి. సెట్‌లో పది క్లిప్స్‌ వస్తాయి. ఎరుపు, గులాబీ... ఇలా పలు రంగుల్లోనూ లభ్యమవుతాయి. వాడకం సులువే కాదు... ధర కూడా తక్కువే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్