ఇంటిల్లపాదికీ అందించం‘డి’
చలి బాగా అనిపిస్తే ఇంట్లో వాళ్లు, పిల్లలు పొద్దెక్కేదాకా దుప్పట్లలో ఉండిపోతారు. లేదా మందపాటి దుస్తులతో ఒంటిని కప్పేస్తారు. ఇలాగైతే డి విటమిన్ ఎలా అందుతుంది? రోగ నిరోధక శక్తి పెరగాలన్నా, ఎముకలు, దంత ఆరోగ్యం దేనికైనా ఇది తప్పనిసరి. మానసిక ఆరోగ్యంపైనా దీని ప్రభావముంటుంది అంటున్నారు నిపుణులు. కాబట్టి, ఇంటిల్లపాదికీ ‘డి’ అందేలా చూసుకోవాల్సింది మనమే....
చలి బాగా అనిపిస్తే ఇంట్లో వాళ్లు, పిల్లలు పొద్దెక్కేదాకా దుప్పట్లలో ఉండిపోతారు. లేదా మందపాటి దుస్తులతో ఒంటిని కప్పేస్తారు. ఇలాగైతే డి విటమిన్ ఎలా అందుతుంది? రోగ నిరోధక శక్తి పెరగాలన్నా, ఎముకలు, దంత ఆరోగ్యం దేనికైనా ఇది తప్పనిసరి. మానసిక ఆరోగ్యంపైనా దీని ప్రభావముంటుంది అంటున్నారు నిపుణులు. కాబట్టి, ఇంటిల్లపాదికీ ‘డి’ అందేలా చూసుకోవాల్సింది మనమే.
సాధారణంగా చలి దేశాల్లో విటమిన్ డి లోపం సహజమే. నిత్యం వేడి వాతావరణం ఉండే మనదేశంలోనూ 76 శాతం మందిలో ఈ లోపం కనిపిస్తోందని తాజాగా ఓ నివేదిక చెబుతోంది. పిల్లల్లో ఎదుగుదలపైనా, మిగతావారిలో ఎముకలు, మానసిక ఇబ్బందులకు కారణమవగలదని హెచ్చరిస్తున్నారు. ఎముకల నొప్పి, వీపు భాగంలో ఇబ్బంది, అలసిపోవడం, తరచూ ఇన్ఫెక్షన్లు, గాయాలు త్వరగా మానకపోవడం, జుట్టు రాలడం, ఆత్రుత వంటివన్నీ దీని లోపానికి చిహ్నాలే. కాబట్టి.. ఇంట్లో వాళ్లంతా రోజూ ఉదయం 15-20 నిమిషాలు ఎండలోకి వెళ్లేలా చూడండి. చలి నుంచీ హాయి.. శరీరానికి కావాల్సిన డి విటమినూ అందుతుంది. పాలపదార్థాలు, చేప నూనె, పుట్టగొడుగులు, గుడ్డు పచ్చసొనల్లో ఇది ఎక్కువ మోతాదులో ఉంటుంది. వీటిలో వీలైనవి రోజూ తీసుకోండి. మందుల ద్వారానూ తీసుకోవచ్చు. కానీ వీటిని ఎక్కువగా గర్భిణులు, చిన్నారులు, మెనోపాజ్ దశలో ఉన్న మహిళలు, 65 ఏళ్లు పైబడిన వారికీ ఇస్తారు. మరీ అవసరమై వైద్యులు సూచిస్తే తప్ప మందుల జోలికి పోకపోవడం మేలు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
బ్యూటీ & ఫ్యాషన్
- ధవళవర్ణంలో దేవకన్యలా..!
- Asoka Makeup Trend: అప్పటి కరీనా లుక్‌ని ఇలా రీక్రియేట్ చేస్తున్నారు!
- తారలు మెచ్చిన ‘ఫుల్కారీ’ ఫ్యాషన్.. ఈ స్టైలిష్ ట్రెండ్ గురించి తెలుసా?
- పొడవైన శిరోజాలతో... గిన్నిస్‌బుక్‌లో..!
- ఈ ఆహారంతో జుట్టు ఆరోగ్యంగా..!
ఆరోగ్యమస్తు
- వీటితో.. కడుపు చల్లగా.. ఆరోగ్యంగా..!
- చనుబాలు ఎక్కువగా వస్తున్నాయి.. తగ్గేదెలా?
- మెనోపాజా... వ్యాయామం చేయండి!
- ఎండకో గొడుగు..!
- హార్మోన్లు సమతులంగా ఉండాలంటే..!
అనుబంధం
- ప్రయోగాలతో నేర్పిద్దామా?
- పెంపకంబట్టి ఎదుగుతారు.!
- నాన్నంటే భయపడుతున్నారు..!
- బద్ధకపు భర్తతో వేగలేకపోతున్నారా?
- లవ్ మ్యారేజ్.. అయినా సంప్రదాయాల పేరిట టార్చర్ చేస్తున్నాడు..!
యూత్ కార్నర్
- టీనాతో ఇంటర్వ్యూకి సిద్ధమా?!
- రాయల్ సొసైటీలో మన స్వెత్లానా!
- వేసవి కథ!
- 29 బాటిళ్లతో ఒక స్విమ్‌సూట్.. విదేశాల్లోనూ పాపులర్!
- Prachi Nigam: స్టేట్ ఫస్ట్.. అయినా బాడీ షేమింగ్ తప్పలేదు!
'స్వీట్' హోం
- ఫర్నిచర్‌పై మరకలు పోవాలంటే..!
- ఈ డ్రింక్‌తో వేసవి వేడిని తరిమేయండి!
- రాత్రివేళకి... సుగంధాల రాణి!
- చెత్తబుట్ట నుంచి దుర్వాసన రాకుండా..!
- తేలిగ్గా వండేద్దాం..!
వర్క్ & లైఫ్
- పట్టు చిక్కాలంటే... ప్రణాళిక ఉండాలి...
- గర్ల్ గ్యాంగ్‌తో వెకేషనా? అందాల ‘బాలి’ వెళ్లాల్సిందే!
- రంగులు తెలిసేలా!
- విజయానికి అందం అడ్డయ్యింది!
- భరణం ఇవ్వాల్సొస్తుందని ఉద్యోగం మానేశాడు!