గుండ్రంగా ఇలా!

చిన్నారులకు అల్పాహారంగానో, సాయంకాలంపూట స్నాక్స్‌గానో.. వేడి వేడిగా ఏ వెజ్‌, నాన్‌వెజ్‌ బాల్స్‌ చేసుకుంటే భలే ఉంటుంది కదూ. వీటిని చూస్తేనే పిల్లలు లొట్టలేసుకుంటూ తినేస్తారు. అయితే వీటి తయారీలో అన్నీ ఒకే ఆకారంలో

Updated : 11 Jan 2022 12:56 IST

చిన్నారులకు అల్పాహారంగానో, సాయంకాలంపూట స్నాక్స్‌గానో.. వేడి వేడిగా ఏ వెజ్‌, నాన్‌వెజ్‌ బాల్స్‌ చేసుకుంటే భలే ఉంటుంది కదూ. వీటిని చూస్తేనే పిల్లలు లొట్టలేసుకుంటూ తినేస్తారు. అయితే వీటి తయారీలో అన్నీ ఒకే ఆకారంలో రావడం కాస్త కష్టమే. ఒకటి పెద్దదిగా మరోటి చిన్నదిగా... ఇలా రకరకాలుగా వస్తాయి. అలా కాకుండా అన్నీ ఒకే ఆకారంలో చక్కగా కుదరాలంటే ఈ చిత్రంలో కనిపిస్తున్న పరికరం వల్లే సాధ్యమవుతుంది. దీంట్లో తయారుచేసి పెట్టుకున్న పిండిని నింపి ప్రత్యేకమైన చెంచాతో అదనపు పిండిని తొలగించాలి. ఆ తర్వాత మూత పెట్టి ఓసారి గట్టిగా నొక్కితే చాలు... గుండ్రటి చక్కటి వెజ్‌ బాల్స్‌ సిద్ధమైపోతాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్