నా రహస్యం... ఆ నలుగుపిండి
అందాల నటి కియారా అడ్వాణీ తన సౌందర్య రహస్యం అమ్మ తయారు చేసే సహజసిద్ధమైన నలుగుపిండి అని చెబుతోంది. తను పాటించే సౌందర్య చిట్కాలను ఇలా చెప్పుకొచ్చింది.
అందాల నటి కియారా అడ్వాణీ తన సౌందర్య రహస్యం అమ్మ తయారు చేసే సహజసిద్ధమైన నలుగుపిండి అని చెబుతోంది. తను పాటించే సౌందర్య చిట్కాలను ఇలా చెప్పుకొచ్చింది.
‘‘వారానికొకసారి అమ్మ నా కోసం శనగలు, పెసలు, బియ్యం కలిపి మెత్తని నలుగు పిండి చేస్తుంది. పాలమీగడకు ఈ నలుగు పిండిని కలిపి ముఖం, మెడ, చేతులకు రాస్తా. పది నిమిషాలు ఆరనిచ్చి, ఆ తర్వాత మునివేళ్లను తడి చేసుకొని వాటితో మృదువుగా ముఖాన్ని, మెడను మర్దనా చేస్తా. ఇది చర్మానికి సహజ సిద్ధమైన స్క్రబ్‌లా పని చేస్తుంది. చర్మంపై మృత కణాలను తొలగించడమే కాకుండా, రక్తప్రసరణ బాగా జరగడానికి తోడ్పడుతుంది. తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేసి మాయిశ్చరైజింగ్ చేసుకుంటా. దీంతో చర్మం మృదువుగా మారి, మెరుపులీనుతుంది. అంతేకాదు, మచ్చలు, ఎండవల్ల కమిలే చర్మం కూడా సహజసిద్ధ కాంతిని సంతరించుకుంటుంది. ఇది మన చర్మాన్ని అందంగా, ఆరోగ్యంగా ఉంచడమే కాదు, అవాంఛిత రోమాల సమస్యనూ దూరం చేస్తుంది.’’
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.