పురుగుల్ని ఆకర్షించే ప్యాడ్‌లు

మొక్కల పెంపకం ఆనందాన్నిచ్చినా వాటికి పట్టే చీడపీడలు పెద్ద తలనొప్పిని తెస్తాయి. పురుగు మందులు వాడితే ఆరోగ్యానికి హానికరమని భయం. తెలిసోతెలియకో ఏదో ఒకటి వాడితే ఒక్కోసారి మొక్కే చనిపోతుంది. మరి పరిష్కారం ఏంటి? ఇదిగో..

Published : 30 Aug 2021 00:23 IST

మొక్కల పెంపకం ఆనందాన్నిచ్చినా వాటికి పట్టే చీడపీడలు పెద్ద తలనొప్పిని తెస్తాయి. పురుగు మందులు వాడితే ఆరోగ్యానికి హానికరమని భయం. తెలిసోతెలియకో ఏదో ఒకటి వాడితే ఒక్కోసారి మొక్కే చనిపోతుంది. మరి పరిష్కారం ఏంటి? ఇదిగో..

* మొక్కల మీద వాలేవన్నీ వాటికి అపాయం తెచ్చేవే అని భయపడొద్దు. ఉదాహరణకు లేడీబగ్‌, కందిరీగ వంటివి  హాని చేయవు. పైగా ఇబ్బంది పెట్టే పురుగుల్ని దూరంగా వెళ్లగొడతాయి.

* కప్పు నీళ్లల్లో రెండు టేబుల్‌ స్పూన్ల వేప నూనె, ఒక టేబుల్‌ స్పూన్‌ లిక్విడ్‌ సోప్‌ కలిపి...పదిహేను రోజులకోసారి మొక్కలకు చల్లితే...చీడల బాధ తగ్గుతుంది.

* కాండాన్ని పీల్చేవాటికి ఎల్లో స్టిక్‌ ప్యాడ్‌లను మొక్కల మొదళ్లలో ఉంచితే పురుగులు వీటికి ఆకర్షితమై అతుక్కుపోతాయి.

* 50 గ్రాముల చొప్పున పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి మిక్సీ పట్టి, లీటర్‌ నీటికి కలపాలి. ఈ మిశ్రమాన్ని ఓ రోజంతా నిల్వ ఉంచి మొక్కలకు చల్లితే తెగుళ్లకు మంచి మందుగా పనిచేస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్