Published : 29/10/2022 20:07 IST

పిల్లల్లో జన్యుపరమైన లోపాలకు కారణాలేంటి?

హలో మేడమ్.. పుట్టిన పిల్లల్లో జన్యుపరమైన లోపాలుండడానికి గల కారణాలేంటి? అసలు అవి ఎలా వస్తాయి?  - ఓ సోదరి

జ. పుట్టిన పిల్లల్లో జన్యుపరమైన లోపాలుండడానికి రెండు ముఖ్యమైన కారణాలుంటాయి.

మొదటిది - జన్యువుల్లో లోపం
ఈ లోపం వంశపారంపర్యంగా రావచ్చు లేదా మ్యుటేషన్‌ (మీ జన్యువుల్లో మార్పు) జరిగి ఉండచ్చు.
రెండో కారణం - పరిసరాల ప్రభావం
అంటే గర్భస్థ శిశువు ఎదిగేటప్పుడు తల్లి గర్భంలోని వాతావరణ ప్రభావం చాలానే ఉంటుంది. బిడ్డకు అవకరాలు కలగజేసే పదార్థాల్ని teratogens అంటారు. ఇవి కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ కూడా కావచ్చు (ఉదాహరణకు- రుబెల్లా వంటివి). అలాగే కొన్ని రకాల మందులు కావచ్చు (ఉదాహరణకు –మూర్ఛకు వాడే మందులు, నెత్తురు గడ్డ కట్టకుండా వాడే మందులు, మొటిమలకు వాడే మందులు మొదలైనవి). అలాగే - పీల్చే గాలిలో, వాతావరణంలో స్వచ్ఛత లేకపోవడం, గాలిలో రసాయనాల శాతం ఎక్కువగా ఉండడం లేదా నీటిలో కాలుష్యం ఎక్కువగా ఉండడం.. మొదలైనవి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని