మొటిమలకు.. కలబంద!
చర్మానికి చల్లదనాన్ని అందించడమే కాదు.. మోముపై ఏర్పడిన మొటిమలు, మచ్చల్ని తగ్గించడంలోనూ కలబందను మించిన ఔషధం మరొకటి లేదని చెప్పడంలో సందేహం లేదు. అందుకే దీన్ని వివిధ రకాల సౌందర్య ఉత్పత్తుల తయారీలో....
చర్మానికి చల్లదనాన్ని అందించడమే కాదు.. మోముపై ఏర్పడిన మొటిమలు, మచ్చల్ని తగ్గించడంలోనూ కలబందను మించిన ఔషధం మరొకటి లేదని చెప్పడంలో సందేహం లేదు. అందుకే దీన్ని వివిధ రకాల సౌందర్య ఉత్పత్తుల తయారీలో ఉపయోగిస్తుంటారు. ఈ క్రమంలో కలబందతో పాటు ఇంట్లో లభించే కొన్ని పదార్థాలను కలిపి ఫేస్‌ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి..
మూడు టేబుల్‌స్పూన్ల కలబంద గుజ్జుకు రెండు టేబుల్‌స్పూన్ల పసుపు, రెండు టేబుల్‌స్పూన్ల రోజ్‌వాటర్ కలిపి మిక్సీ పట్టుకోవాలి. ఇందులో టేబుల్‌స్పూన్ శెనగపిండి వేసి మరోసారి మిక్సీ పట్టుకోవాలి. అవసరమైతే ఇందులో మరికొంత రోజ్‌వాటర్ లేదంటే శెనగపిండి వేసుకొని పేస్ట్‌లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకొని 20 నిమిషాల పాటు ఉంచి ఆపై గోరువెచ్చటి నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచూ చేయడం వల్ల మొటిమల సమస్యను ఇట్టే తగ్గించుకోవచ్చంటున్నారు నిపుణులు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.