Updated : 29/11/2021 17:01 IST

అమ్మాయిలూ.. ఈ స్కాలర్‌షిప్‌ మీకోసమే!

కెరీర్‌లో ఏ లక్ష్యాన్ని సాధించాలన్నా దానికి ప్రతిభే కొలమానం. ప్రముఖ సెర్చ్‌ ఇంజిన్‌ ‘గూగుల్‌’ కూడా ఇదే చెబుతోంది. ప్రతిభ ఉన్న అమ్మాయిలకు స్కాలర్‌షిప్‌ ఇస్తూ వారికి ఆర్థికసహాయాన్ని అందించాలనుకుంటోంది. వారు తమ లక్ష్యాలను చేరుకునేందుకు ఈ విధంగా ప్రోత్సాహం అందించడానికి ముందుకొచ్చింది. 'జనరేషన్ గూగుల్ స్కాలర్‌షిప్' పేరుతో ఇవ్వనున్న ఈ ఉపకార వేతనానికి కంప్యూటర్‌ సైన్స్‌లో డిగ్రీ చదువుతోన్న అమ్మాయిలు అర్హులు. దీనికి ఎంపికైన అమ్మాయిలకు 2022-23 విద్యాసంవత్సరానికి గాను 1000 డాలర్లను ఈ సంస్థ ఇవ్వనుంది. అంటే మన కరెన్సీలో 75000 రూపాయలన్నమాట. మరి, ఈ స్కాలర్‌షిప్‌కి కావాల్సిన అర్హతలు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలి? వంటి వివరాలను ఓ సారి చూద్దాం రండి...

కావాల్సిన అర్హతలు...

* 2020-21 విద్యాసంవత్సరం బ్యాచిలర్‌ డిగ్రీ కోర్సులో రెగ్యులర్‌ విద్యార్థిగా పేరు నమోదు చేసుకొని ఉండాలి.

* గుర్తింపు పొందిన యూనివర్సిటీలో రెండో సంవత్సరం చదువుతుండాలి. ఆ విశ్వవిద్యాలయం ఆసియా పసిఫిక్‌ పరిధిలోనే ఉండాలి.

* కంప్యూటర్‌ సైన్స్‌, కంప్యూటర్‌ ఇంజినీరింగ్ లేదా టెక్నాలజీకి సంబంధించిన కోర్సులు చదువుతున్న వారు మాత్రమే అర్హులు.

* మంచి అకడమిక్‌ రికార్డు కలిగి ఉండాలి.

* నాయకత్వ లక్షణాలు కలిగి ఉండాలి.

కావాల్సిన డాక్యుమెంట్లు..

* సాంకేతిక అంశాలకు సంబంధించి ఇది వరకు చేసిన ప్రాజెక్టులు, కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్‌ కార్యక్రమాల్లో పాల్గొన్న అంశాలను ప్రస్తావిస్తూ రెజ్యూమే రూపొందించాలి.

* విద్యార్హతలకు సంబంధించిన డాక్యుమెంట్లు దీనికి జతచేయాలి.

* ఈ క్రింది అంశాలపై వ్యాసాలు రాయాలి. ఈ రెండు వ్యాసాల ద్వారా మీలోని సృజనాత్మకత, నిబద్ధత, పనితీరు, మీకున్న ఆర్థిక అవసరాలు.. వంటి అంశాలను పరిశీలిస్తారు. ప్రతి వ్యాసం 400 పదాలకు మించకుండా ఆంగ్లంలో రాయాలి.

1) టెక్నాలజీ రంగంలో మహిళలు ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటున్నారని మీరు భావిస్తున్నారు? ఒకవేళ ఆ సవాళ్లను పరిష్కరించే బృందంలో మీరు భాగమైతే ఏం చేస్తారు? మీరిచ్చే సమాధానం ఎంతో మందిని ఎన్నో రకాలుగా ప్రభావితం చేస్తుందన్న విషయం గుర్తు పెట్టుకోండి.

2) ఒకవేళ ఈ స్కాలర్‌షిప్‌కి మీరు ఎంపికైతే.. ఇది మీ చదువుకు ఎలా ఉపయోగపడుతుంది? ఈ స్కాలర్‌షిప్‌ పొందడానికి గల మీ అవసరాలను వివరించండి. మీకు ఈ స్కాలర్‌షిప్‌ లభించడం ద్వారా భవిష్యత్తులో ఎలాంటి లక్ష్యాలను చేరుకోగలుగుతారు?
ఈ డాక్యుమెంట్లను పీడీఎఫ్‌ రూపంలో అటాచ్‌ చేయాల్సి ఉంటుంది.

ఈ స్కాలర్‌షిప్‌కి దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది: డిసెంబర్‌ 10, 2021

గూగుల్‌ ఉద్యోగులు దీనికి అనర్హులు. దీనిపై ఏవైనా సందేహాలు ఉంటే generationgoogle-apac@google.com మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు.

మరిన్ని వివరాలకు ఈ వెబ్‌సైట్‌ను చూడండి...

https://buildyourfuture.withgoogle.com/scholarships/generation-google-scholarship-apac


Advertisement

మరిన్ని

వీటితో పిల్లలకు పాలివ్వడం ఎంతో సులువు!

పసి పిల్లలకు ఆరు నెలలు అంతకుమించి ఏడాది వరకు తల్లిపాలు పట్టడం తప్పనిసరి అంటూ నిపుణులు చెప్పడం మనకు తెలిసిందే. అయితే ఇటు కుటుంబంతో పాటు అటు వృత్తి ఉద్యోగాలకూ సమప్రాధాన్యమిచ్చే అమ్మలున్న ఈ రోజుల్లో ఏడాది వరకు బిడ్డకు తానే నేరుగా పాలివ్వడం అంటే అది కాస్త కష్టమనే చెప్పుకోవాలి. అలాగని బిడ్డలను అలా వదిలేసి తల్లులూ తమ వృత్తిపై దృష్టి పెట్టలేరు. అందుకే అటు నేటి తల్లుల బ్రెస్ట్‌ఫీడింగ్ పనిని సులభతరం చేస్తూ, ఇటు పిల్లలకు తల్లిపాలు అందుబాటులో ఉండేలా చేసేందుకు వివిధ రకాల బ్రెస్ట్‌ఫీడింగ్ గ్యాడ్జెట్లు ప్రస్తుతం మార్కెట్లోకొచ్చేశాయి.

తరువాయి

సైజ్‌ జీరో కాదు.. ఆరోగ్యం ముఖ్యం!

‘మనసులో కలిగే ఆలోచనల్నే శరీరం ప్రతిబింబిస్తుంది..’ అంటోంది ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ అంకితా కొన్వర్‌. సైజ్‌ జీరో గురించి ఆలోచిస్తూ బాధపడితే మరింత బరువు పెరుగుతామని, అదే ఆరోగ్యంపై దృష్టి పెడితే శరీరం, మనసు రెండూ మన అధీనంలో ఉంటాయని చెబుతోంది. ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై ఎక్కువ శ్రద్ధ పెడుతూ.. ఆ చిట్కాల్ని సోషల్‌ మీడియాలో పంచుకుంటూ అందరిలో స్ఫూర్తి నింపే ఈ మిసెస్‌ సోమన్‌.. తాజాగా బాడీ పాజిటివిటీ గురించి ఇన్‌స్టాలో మరో స్ఫూర్తిదాయక పోస్ట్‌ పెట్టింది. సైజ్‌ జీరో కంటే ఆరోగ్యమే ముఖ్యమంటూ ఆమె షేర్‌ చేసిన పోస్ట్‌ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

తరువాయి