
అందుకే పెరట్లో ఈ ఔషధ మొక్కలు ఉండాల్సిందే..!
ఒకప్పుడు జలుబు, దగ్గు.. వంటి చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఎదురైనప్పుడు వాటిని తగ్గించుకోవడానికి మూలికా వైద్యం చేసేవారు. కానీ రాన్రానూ వాటిని తక్షణమే తగ్గించుకొనే రసాయనిక మందులు పుట్టుకొచ్చాయి. అయితే ఇంత చిన్న సమస్యలకు కూడా అలాంటి మందులు పదే పదే వాడడం వల్ల క్రమంగా రోగనిరోధక శక్తి తగ్గిపోయే అవకాశముంటుంది. అందుకే వాటికి బదులుగా ఔషధ గుణాలున్న కొన్ని మొక్కల్ని పెరట్లో పెంచుకొని ఉపయోగిస్తే సరి. అవేంటంటే..!
కొత్తిమీర
కొత్తిమీర మహిళల్లో రక్తహీనత, నెలసరి సమస్యలు ఎదురవకుండా చూస్తుంది. ఆర్థరైటిస్ బారిన పడకుండా చేస్తుంది. రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గించి ఊబకాయం సమస్య నుంచి విముక్తి కల్పిస్తుంది. యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ ‘ఎ’, ‘సి’ ఇందులో పుష్కలంగా లభిస్తాయి. అలాగే ఎలర్జీలు, ఇన్ఫెక్షన్లు రాకుండా నివారిస్తుంది. ఇన్ని మంచి లక్షణాలున్న కొత్తిమీరను రోజూ వంటల్లో ఉపయోగిస్తే.. చక్కటి ఆరోగ్యం మన సొంతమవుతుంది.
తులసి
తులసిలో ఎన్నో విశిష్టమైన లక్షణాలున్నాయి. తులసి మొక్క గాలిని శుద్ధి చేస్తుంది. ఫలితంగా మన చుట్టూ ఉన్న గాలిలో కాలుష్యం తగ్గుముఖం పడుతుంది. తులసి ఔషధ పరంగా ఎంతో విశిష్టమైంది. దీనిలో యాంటీఫంగల్, యాంటీబ్యాక్టీరియల్, యాంటీబయోటిక్ గుణాలున్నాయి. దీంతో శ్వాస, చర్మ సంబంధిత అలర్జీలు మన దరి చేరకుండా ఉంటాయి. ఈ మొక్క ఆరోగ్యపరంగానే కాకుండా అందాన్ని కాపాడటంలోనూ మనకి తోడ్పడుతుంది. అందుకే ఇంట్లో తులసి మొక్కను పెంచుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చు.
లావెండర్
అద్భుతమైన సువాసన వెదజల్లే లావెండర్లో ఔషధ గుణాలు మెండుగా ఉంటాయి. ఇవి ఒత్తిడిని తగ్గించి మనసుని ఉల్లాసంగా ఉండేలా చేస్తాయి. లావెండర్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీసెప్టిక్ గుణాలుంటాయి. ఇవి కాలిన గాయాలను తగ్గేలా చేస్తాయి. లావెండర్ ఆకులు, పువ్వులు- పురుగులు కుట్టినప్పుడు వచ్చే కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు రాకుండా చేస్తాయి. అలాగే అందాన్ని కాపాడుకోవడంలోనూ సహకరిస్తాయి. స్టార్ హోటల్స్‌లో ఆహారపదార్థాలకు ప్రత్యేక రుచి రావడం కోసం లావెండర్ని ఆహారపదార్థాల్లోనూ వేస్తారు.
నిమ్మగడ్డి
నిమ్మగడ్డిని, దాని నుంచి తయారయ్యే నూనెని ఔషధాల తయారీలో విరివిగా ఉపయోగిస్తారు. దీనిలో కడుపునొప్పి, అధిక రక్తపోటు, ఫిట్స్, దగ్గు, వాంతులు, కీళ్లనొప్పులు, జ్వరం, జలుబు వంటి వాటిని తగ్గించే లక్షణాలున్నాయి. నిమ్మగడ్డి కొన్ని రకాల హానికారక క్రిములను నాశనం చేస్తుంది. అలాగే కొన్ని ఆహార పదార్థాల్లో ఫ్లేవర్ కోసం కూడా నిమ్మగడ్డిని ఉపయోగిస్తారు. దీనిలో విటమిన్ ‘ఎ’, సిట్రాల్ పుష్కలంగా లభిస్తాయి. దీంతో తయారుచేసే లెమన్‌గ్రాస్ టీ తాగడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది.
Advertisement
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని

వర్షాల వేళ వార్డ్రోబ్ జాగ్రత్త!
చినుకులు మొదలయ్యాయంటే దుస్తులు త్వరగా ఆరవు. అల్మరల్లోకి తేమ చేరడం, వస్త్రాల నుంచి ఒకలాంటి వాసన వంటివి వస్తుంటాయి. వీటి నుంచి తప్పించుకోవాలా? ఈ చిట్కాలు పాటించేయండి. అలమరాల్లో దట్టంగా వార్తాపత్రికలను పరిచి ఉంచండి. ఇవి తేమను పీల్చేస్తాయి. దుస్తులు పూర్తిగా ఆరాయి అన్న తరువాతే కప్‌బోర్డ్‌లో పెట్టండి. ఎండ లేదనిపిస్తే హెయిర్ డ్రైయర్‌తో ఓసారి ఆరబెట్టాకే....తరువాయి

వర్షాకాలంలో పచ్చని బాల్కనీ...
చినుకులు పడుతున్న వేళ బాల్కనీలో నిలబడి వెచ్చని టీ తాగుతుంటే... పాదాలకు మెత్తని పచ్చిక తగిలితే.. ప్రకృతి మన చెంతకు వచ్చినట్లే. ఇప్పటికిప్పుడు బాల్కనీలో పచ్చదనాన్ని నింపేదెలా అనుకోవద్దు. ఆర్టిఫిషియల్ గ్రాస్ సర్దేస్తే చాలు. వర్షాకాలంలో పచ్చని మెత్తదనం మన పాదాలకు తగులుతూ.. మనసంతా ఉత్సాహాన్ని నింపుతుంది....తరువాయి

బోర్డులు కొత్త అర్థాన్ని చెబుతున్నాయి
గేటుకు వేలాడే నేమ్‌బోర్డు నెమ్మదిగా ఇంటి బయటి గోడకు వచ్చి చేరింది. పొందికగా రాసిన ఆ ఇంటి సభ్యుల పేర్లతో అందంగా వేలాడుతోంది. ఇప్పుడీ సంప్రదాయం ఇంట్లోకీ.. వచ్చి చేరింది. గది వివరాలను చెప్పేలా, సరదాను చాటే హాల్ ముందు, మామ్స్ కేఫ్ అంటూ వంటింటి గుమ్మంలో, కాఫీ సమయం అంటూ కప్పులన్నీ వేలాడేలా, మాస్క్లుంచే మాస్క్ స్టేషన్లా తీర్చిదిద్దిన బోర్డులిప్పుడు డెకార్‌కి కొత్త అర్థాన్ని చెబుతున్నాయి...తరువాయి

Kitchen Gadgets : ఇక.. పప్పు డబ్బా కోసం వెతకక్కర్లేదు!
ఫొటోలో చూపించినట్లుగా.. ఒక్కో కంటెయినర్ విడివిడిగా లేదంటే నాలుగైదు కలిపి గోడకు అమర్చుకునేలా దీన్ని రూపొందించారు. వీటిలో ఉండే డబ్బాల్లో ధాన్యాలు, పప్పులు, ఫ్లేక్స్, బీన్స్.. ఏవైనా నింపుకోవచ్చు. ఇక దీనికి ముందు భాగంలో ఉన్న బటన్ నొక్కగానే.. అడుగున ఉన్న రంధ్రంలో నుంచి....తరువాయి

కొన్నాక బాధపడొద్దంటే..!
కొనుగోళ్లన్నీ ఆన్లైనే! ఎంతో ముచ్చటపడి కొంటామా.. ఒకటి, రెండు ఉతుకులకే పాడవుతుంటాయి కొన్ని. కొన్నేమో రెండోసారికే వేయబుద్దేయదు. డబ్బు వృథా, అసంతృప్తి. వీటినుంచి తప్పించుకోవాలా? నిపుణులేం చెబుతున్నారంటే... లోపల చూడాలి.. ఆకర్షణ సరే... నాణ్యత తెలియాలంటే లోపల చెక్ చేయాలి. అంచుల నుంచి దారాలు ఊడుతున్నాయా? లాకింగ్ సరిగా ఉందా? చూడాలి. పక్కల కుట్టు అంచులకు మరీ దగ్గరగా ఉండొద్దు.తరువాయి

టైల్స్ మధ్య మురికిని పోగొట్టాలంటే..
నేలను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నా సరే.. టైల్స్ మధ్య మురికి చేరుతుంటుంది. ఇంట్లో చేరిన దుమ్ముకి, తేమ తోడవడంతో అది కాస్తా గట్టిపడిపోయి.. టైల్స్ మధ్యన చేరుతుంది. ఫలితంగా ఫ్లోర్‌ని తరచూ శుభ్రం చేస్తున్నా.. పెద్దగా ఫలితం కనిపించదు. అయితే టైల్స్ మధ్య చేరిన మురికిని....తరువాయి

రిమోట్.. మాయమవదిక!
హాలులో కూర్చొని టీవీ చూద్దామనుకుంటామా! చాలా ఇళ్లలో ఒకటే అనుభవం- టీవీ రిమోటు కనిపించదు. దాన్ని వెతకడం ఓ పెద్ద పని. దీన్ని సులువు చేస్తాయీ రిమోట్ హోల్డర్లు. కొన్నింటికి టిష్యూలు, మొక్కలు.. ఇలా ఇతర వాటిని అదనంగా పెట్టుకునే వీలుతోనూ వస్తున్నాయి. బొమ్మలు, భిన్న రూపాల్లో ఉండే ఇవి టీపాయ్లకీ ప్రత్యేక అందం. బాగున్నాయి కదూ!...తరువాయి

వెల్లుల్లి పలుకుల కోసం...
మనం దాదాపుగా అన్ని కూరల్లో వెల్లుల్లి వాడతాం. వెల్లుల్లి రెబ్బల్ని సగానికి విరుస్తుంటే లేదా చితుపుతుంటే వేళ్లు మండినట్లవుతాయి. అనుకున్నంతగా చితకవు కూడా. అందుకోసం కనిపెట్టిందే హెవీ డ్యూటీ గార్లిక్ ప్రెస్. రెండు కర్రలున్న సుత్తిలా కనిపించే ఈ సాధనం మధ్యలో వెల్లుల్లి పెట్టి నొక్కితే చాలు కచ్చాపచ్చాగా అయిపోతుంది.తరువాయి

సర్వం పండించేయొచ్చు...
మొక్కల్ని చూస్తే ముచ్చటేస్తుంది కదూ! కాసిని నీళ్లు పోస్తే చాలు.. పూలూ ఫలాలూ ఇచ్చి కృతజ్ఞతలు తెలియజేస్తాయి. పెరడుంటే బాగుండేది... అపార్ట్మెంట్లలో ఎలా అంటారా?! మరేం పరవాలేదు కుండీల్లో పెంచండి.. ఎందరెందరో మిద్దె తోటలతో అద్భుతాలు చేస్తున్నారు. ముందు కాసిని మొక్కలతో ఆరంభించేయండి. అందుకోసం ఏం చేయాలంటే...తరువాయి
బ్యూటీ & ఫ్యాషన్
- Artificial Jewellery: ఆ అలర్జీని తగ్గించుకోవాలంటే..!
- దిష్టి తాడుకు.. నయా హంగు!
- వయసును దాచేద్దామా...
- మొటిమలకు.. కలబంద!
- కాలి మెట్టె.. కాస్త నాజూగ్గా!
ఆరోగ్యమస్తు
- ప్రసవం తర్వాత.. ఆ భాగం బిగుతుగా మారాలంటే..
- ఈ పోషకాలతో సంతాన భాగ్యం!
- అరచేతుల్లో విరబూసే గోరింట ఆరోగ్యానికీ మంచిదే..!
- యోగా చేస్తున్నది ఏడు శాతమే!
- ఇవి తింటే ఒత్తిడి దూరం..
అనుబంధం
- సారీతో నేర్పించొచ్చు
- బంధానికి ‘బ్రేక్’ ఇవ్వకండి..!
- పండంటి జీవితానికి పంచ సూత్రావళి
- పిల్లల్ని వాళ్ల గదిలో ఎప్పుడు పడుకోబెట్టాలి?
- వేధింపులకు గురవుతున్నారేమో..
యూత్ కార్నర్
- ఒకటే గొప్పనుకుంటే.. ఆరు చోట్ల సాధించింది!
- అందాల.. గిరి కన్య
- Down Syndrome: అప్పుడు ప్రతి క్షణాన్ని ఆస్వాదించా..!
- ప్రియాంకా మాటలే.. కిరీటానికి బాటలు
- అమ్మమ్మ సూచన... కోట్ల వ్యాపారం!
వర్క్ & లైఫ్
- ఫుల్‌టైం ఉద్యోగం చేయమంటున్నారు!
- కొత్త పెళ్లికూతుళ్లు.. వీటి గురించే తెగ వెతికేస్తున్నారట!
- పెదనాన్న ఆస్తి నేను రాయించుకోవచ్చా?
- కొత్త కొలువా.. నిబంధనలు తెలుసుకున్నారా?
- ప్రశంసల్ని ఆస్వాదిస్తున్నారా?
సూపర్ విమెన్
- అందుకే పీహెచ్డీ వదిలేసి వ్యవసాయం చేస్తోంది!
- Miss India Sini Shetty: చిన్నప్పటి నుంచే కలలు కంది.. సాధించింది!
- 70ల్లో... 80 పతకాలు!
- ఆమె నగ... దేశదేశాలా ధగధగ
- ఆహార సేవకులు