Published : 13/12/2021 20:01 IST

కలయిక తర్వాత బ్లీడింగ్‌.. ఇదేమైనా సమస్యా?

నమస్తే మేడమ్. నాకు పెళ్లై 8 ఏళ్లవుతోంది. నాకు ఈ మధ్య కలయిక సమయంలో వెజైనా నుంచి బ్లడ్‌ క్లాట్స్‌, చీములా బయటికి వస్తోంది. ఇదేమైనా సమస్యా? ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఎలాంటి చికిత్సలు చేయించుకోవాలి? దయచేసి చెప్పండి. - ఓ సోదరి

జ. కలయిక తర్వాత రక్తం, చీము బయటికి రావడం అనేది ఏమాత్రం మంచిది కాదు. తప్పనిసరిగా మీరు గైనకాలజిస్ట్‌ దగ్గరికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలి. ఎందుకంటే గర్భాశయ ద్వారంలో ఎరోజన్‌ (Erosion) ఉన్నా, పాలిప్స్‌ ఉన్నా, క్యాన్సర్ ఉన్నా కూడా ఇలాంటి లక్షణాలే కనిపిస్తాయి. అలాగే గర్భాశయం లోపల సమస్యలున్నా కూడా ఇలాగే జరుగుతుంది. కాబట్టి డాక్టర్‌ మీకు పాప్‌స్మియర్‌, హెచ్‌పీవీ పరీక్ష, అల్ట్రాసౌండ్‌ స్కాన్ చేయడం ద్వారా వ్యాధి నిర్ధారణ చేయగలుగుతారు. అందుకే ఆలస్యం చేయకుండా డాక్టర్‌ని సంప్రదించడం మంచిది.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని