రొమ్ముల్లో గడ్డలున్నాయి.. ప్రమాదకరమా?

హాయ్‌ మేడమ్‌.. నా రెండు రొమ్ముల్లో గడ్డలున్నాయి. వాటివల్ల కొన్నిసార్లు నొప్పిగా ఉంటుంది.. మరికొన్ని సార్లు నొప్పేమీ ఉండట్లేదు. స్కానింగ్‌ చేయించుకొని ట్యాబ్లెట్స్‌ వాడాను. మళ్లీ కొన్ని నెలల తర్వాత గడ్డలు ఏర్పడ్డాయి. అప్పుడు మళ్లీ స్కానింగ్‌ చేయించుకుంటే రిపోర్ట్స్‌లో నార్మల్‌ అని వచ్చింది.. కానీ నాకు మాత్రం గడ్డలున్నట్లుగా తెలుస్తోంది.

Published : 18 Dec 2021 17:01 IST

హాయ్‌ మేడమ్‌.. నా రెండు రొమ్ముల్లో గడ్డలున్నాయి. వాటివల్ల కొన్నిసార్లు నొప్పిగా ఉంటుంది.. మరికొన్ని సార్లు నొప్పేమీ ఉండట్లేదు. స్కానింగ్‌ చేయించుకొని ట్యాబ్లెట్స్‌ వాడాను. మళ్లీ కొన్ని నెలల తర్వాత గడ్డలు ఏర్పడ్డాయి. అప్పుడు మళ్లీ స్కానింగ్‌ చేయించుకుంటే రిపోర్ట్స్‌లో నార్మల్‌ అని వచ్చింది.. కానీ నాకు మాత్రం గడ్డలున్నట్లుగా తెలుస్తోంది. మా నాయనమ్మ అవి పాల గడ్డలు అని చెబుతోంది.. ప్రస్తుతం నాకు నాలుగేళ్ల బాబున్నాడు. అసలు ఎందుకిలా అవుతుంది? ఇదేమైనా సమస్యా? దయచేసి చెప్పండి. - ఓ సోదరి

జ: మీ బాబు వయసు నాలుగేళ్లని రాశారు. అంటే మీరు ఇంకా పాలిస్తూనే ఉన్నారా? అయితే పాలివ్వనప్పుడు పాలగడ్డలు ఉండడం సహజం కాదు. మీకు స్కానింగ్‌లో ఏమీ లేదని వచ్చిందంటే బహుశా అవి పాలగడ్డలే అయి ఉంటాయి. ఎందుకంటే వేళ్ల మధ్య పట్టుకొని చూసినప్పుడు.. అదీ ముఖ్యంగా నెలసరికి ముందు చూసుకుంటే అక్కడక్కడా గడ్డలున్నట్లుగానే అనిపిస్తుంది. అలాగే ఒకసారి గైనకాలజిస్ట్‌ని సంప్రదిస్తే వారు ఒకసారి పరీక్షించి చూసి మీకు అవసరమైన సలహా కూడా ఇస్తారు.

ఇంట్లోనే వక్షోజాల్ని ఇలా పరీక్షించుకోండి!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్