ఎడమవైపు రొమ్ములో నొప్పి.. ఎందుకిలా?

నమస్తే మేడం. నా వయసు 29. మాకు ఇద్దరు పిల్లలు. అయితే నా ఎడమవైపు రొమ్ము కాస్త చిన్నగా ఉంటుంది. తాకినప్పుడల్లా నొప్పి వస్తుంది.. సాధారణ సమయాల్లో కూడా భుజం దగ్గర్నుంచి లాగుతూ నొప్పి పుడుతోంది. ఇలా ఎందుకు జరుగుతోందో చెప్పండి. - ఓ సోదరి

Published : 17 Feb 2022 18:12 IST

నమస్తే మేడం. నా వయసు 29. మాకు ఇద్దరు పిల్లలు. అయితే నా ఎడమవైపు రొమ్ము కాస్త చిన్నగా ఉంటుంది. తాకినప్పుడల్లా నొప్పి వస్తుంది.. సాధారణ సమయాల్లో కూడా భుజం దగ్గర్నుంచి లాగుతూ నొప్పి పుడుతోంది. ఇలా ఎందుకు జరుగుతోందో చెప్పండి. - ఓ సోదరి

జ: శరీరంలో జతగా ఉండే ఏ అవయవాల్లోనైనా కొద్దిగా చిన్న పెద్ద తేడాలుండడం సహజం. ఉదాహరణకు కళ్లు, చెవులు.. అలాగే రొమ్ముల పరిమాణంలో కూడా కొద్దిపాటి తేడాలు ఉండచ్చు. కానీ మీకు నొప్పి ఎందుకు వస్తోందో తెలియాంటే ఒకసారి డాక్టర్‌కి చూపించుకోండి. చాలావరకు మీ వయసులో హార్మోన్ల ప్రభావం వల్ల వక్షోజాల్లో కణాల్లో మార్పు జరిగినప్పుడు నొప్పి వస్తుంది. డాక్టర్‌ పరీక్షించి చూసి ఒకవేళ అవసరం అనుకుంటే అల్ట్రాసౌండ్‌ స్కాన్‌ ద్వారా సోనోమమోగ్రఫీ కూడా చేసి చూస్తారు. చాలా వరకు మందులు వాడడం ద్వారా ఇలాంటి నొప్పులు తగ్గిపోతాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్