రొమ్ముల్లో నొప్పి తగ్గట్లేదు.. ఏం చేయాలి?

హాయ్‌ డాక్టర్‌. నాకు రెండు రొమ్ములూ నొప్పిగా ఉంటున్నాయి. ప్రస్తుతం మందులు వాడుతున్నా సమస్య తగ్గట్లేదు. ఇలా ఎందుకు జరుగుతుంది? నొప్పి తగ్గడానికి పరిష్కారం చెప్పగలరు.

Published : 19 Jul 2023 19:14 IST

హాయ్‌ డాక్టర్‌. నాకు రెండు రొమ్ములూ నొప్పిగా ఉంటున్నాయి. ప్రస్తుతం మందులు వాడుతున్నా సమస్య తగ్గట్లేదు. ఇలా ఎందుకు జరుగుతుంది? నొప్పి తగ్గడానికి పరిష్కారం చెప్పగలరు. - ఓ సోదరి

జ: రొమ్ముల్లో నొప్పి ఉందన్నారు.. అయితే మీ వయసు కానీ, మీ నొప్పి గురించి ఇతర వివరాలు కానీ లేదా మీకు పాలు తాగే పిల్లలు ఉన్నారా అన్న విషయాలేవీ రాయలేదు. ఈ నొప్పి అనేది నిరంతరాయంగా ఉంటుందా లేదంటే నెలసరికి ముందు మాత్రమే వస్తుందా? అనేది పరిశీలించుకొని.. ఒకసారి గైనకాలజిస్ట్‌తో పరీక్ష చేయించుకోవాలి. అలాగే అవసరమైతే సోనోమామోగ్రఫీ చేయించుకుంటే నొప్పికి కారణం తెలియచ్చు. సాధారణమైన నొప్పి అయితే పెయిన్‌ కిల్లర్స్‌, కొన్ని రకాల విటమిన్‌ సప్లిమెంట్స్‌ వాడితే తగ్గుతుంది. హార్మోన్లకు సంబంధించిందైతే హార్మోన్‌ మాత్రలు వాడాల్సి ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని