సిస్టు ఉంది.. సహజంగా గర్భం ధరించే అవకాశముందా?

హాయ్‌ మేడమ్‌. నాకు పెళ్లై ఐదేళ్లవుతోంది. ఇంకా పిల్లల్లేరు. ఎండోమెట్రియోసిస్‌ సిస్ట్‌ ఉందని గతేడాది ల్యాప్రోస్కోపీ సర్జరీ చేశారు. కానీ సిస్ట్‌ మళ్లీ వచ్చింది. ఈ సమస్య వల్ల నేను సహజంగా గర్భం ధరించగలనా? దయచేసి చెప్పండి.

Published : 22 Jul 2021 16:27 IST

హాయ్‌ మేడమ్‌. నాకు పెళ్లై ఐదేళ్లవుతోంది. ఇంకా పిల్లల్లేరు. ఎండోమెట్రియోసిస్‌ సిస్ట్‌ ఉందని గతేడాది ల్యాప్రోస్కోపీ సర్జరీ చేశారు. కానీ సిస్ట్‌ మళ్లీ వచ్చింది. ఈ సమస్య వల్ల నేను సహజంగా గర్భం ధరించగలనా? దయచేసి చెప్పండి.

- ఓ సోదరి

జ: మీరు సహజంగా గర్భం ధరించే అవకాశాలున్నాయా? లేదా? చెప్పాలంటే.. మీకు ఎండోమెట్రియోసిస్‌ ఏ స్టేజిలో ఉంది? ఆ సమస్య వల్ల మీ ఫెలోపియన్‌ ట్యూబుల్లో అడ్డంకులేవైనా ఏర్పడ్డాయా? ఇంకా మీ సంతానలేమికి మీలో గానీ, మీ భర్తలో గానీ ఏవైనా సమస్యలున్నాయా? వంటి విషయాలన్నీ తెలియాలి. ఒకసారి ల్యాప్రోస్కోపీ చికిత్స జరిగిన తర్వాత సిస్ట్‌ మళ్లీ వచ్చిందంటే మీది స్టేజ్‌-4 ఎండ్రోమెట్రియోసిస్‌ అయి ఉంటుంది. ఒకవేళ సిస్ట్‌ బాగా పెద్దగా ఉంటే తిరిగి ల్యాప్రోస్కోపీ చేయాలి.. లేదా సిస్ట్‌ 3 సెంటీమీటర్ల కన్నా చిన్నగా ఉంటే మందులు వాడడం ద్వారా కూడా తగ్గించచ్చు. ఈ చికిత్స జరిగిన వెంటనే ఐవీఎఫ్‌ ద్వారా పిల్లల కోసం ప్రయత్నిస్తే మంచి ఫలితం ఉంటుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్