నెలకు రెండుసార్లు పిరియడ్స్‌ వస్తున్నాయి.. ఎందుకిలా?

హలో డాక్టర్‌. నా వయసు 23. 14 ఏళ్లకు రజస్వల అయ్యాను. ఇప్పుడు నాకు నెలకు రెండుసార్లు పిరియడ్స్‌ వస్తున్నాయి. రెండేళ్ల క్రితం ఇలాగే వస్తే డాక్టర్‌ని సంప్రదించాను. కొన్ని మందులిచ్చారు. అవి వాడిన తర్వాత బాగానే....

Published : 20 Apr 2023 15:08 IST

హలో డాక్టర్‌. నా వయసు 22. 14 ఏళ్లకు రజస్వల అయ్యాను. ఇప్పుడు నాకు నెలకు రెండుసార్లు పిరియడ్స్‌ వస్తున్నాయి. రెండేళ్ల క్రితం ఇలాగే వస్తే డాక్టర్‌ని సంప్రదించాను. కొన్ని మందులిచ్చారు. అవి వాడిన తర్వాత బాగానే ఉంది.. కానీ ఇప్పుడు సమస్య మళ్లీ మొదలైంది. ఎందుకిలా జరుగుతుంది..? పరిష్కారం చెప్పండి. - ఓ సోదరి

జ: నెలసరి నెలకోసారి కాకుండా త్వరగానో, ఆలస్యంగానో వస్తే అది హార్మోన్ల సమస్య అని అర్థం. అండాశయం నుంచి తయారయ్యే హార్మోన్లలో కానీ లేదా పిట్యూటరీ నుండి తయారయ్యే హార్మోన్లలో కానీ లోపం ఉంటే ఇలా జరుగుతుంది. ఒక్కోసారి అండాశయాల్లో సిస్టులు తయారైతే కూడా ఇలాంటి తేడాలొస్తాయి. అందుకని మీరు ఒకసారి గైనకాలజిస్ట్‌ని సంప్రదిస్తే ట్రాన్స్‌ వెజైనల్‌ అల్ట్రాసౌండ్‌ స్కాన్‌, ఇంకా అవసరమైతే హార్మోన్ల పరీక్షలు చేసి దాని ప్రకారం చికిత్స చేస్తారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్