హైపోథైరాయిడిజం ఉంటే పిల్లలు పుట్టరా?

నా బరువు 40 కిలోలు. పెళ్లై మూడేళ్లయింది. నాకు హైపోథైరాయిడిజం ఉంది. ప్రస్తుతం 50 ఎంసీజీ ట్యాబ్లెట్స్‌ వాడుతున్నా. అయినా నేను తల్లిని కాలేకపోతున్నా. హైపోథైరాయిడిజం ఉంటే పిల్లలు పుట్టరా? - ఓ సోదరి

Published : 31 May 2024 13:13 IST

నా బరువు 40 కిలోలు. పెళ్లై మూడేళ్లయింది. నాకు హైపోథైరాయిడిజం ఉంది. ప్రస్తుతం 50 ఎంసీజీ ట్యాబ్లెట్స్‌ వాడుతున్నా. అయినా నేను తల్లిని కాలేకపోతున్నా. హైపోథైరాయిడిజం ఉంటే పిల్లలు పుట్టరా? - ఓ సోదరి

జ: హైపోథైరాయిడిజం ఉన్న వారికి ట్యాబ్లెట్స్ డోసు సరిపోయిందా, లేదా తెలుసుకోవాలంటే గర్భం ధరించే ముందు ఒకసారి థైరాయిడ్‌ ప్రొఫైల్‌ పరీక్షలు చేయించుకోవాలి. టీఎస్‌హెచ్‌ 2.5 కంటే తక్కువగా ఉన్నట్లయితే గర్భం ధరించడానికి థైరాయిడ్‌ వల్ల సమస్య ఉండదు. మీరు బరువు 40 కిలోలు అన్నారు కానీ మీ ఎత్తు ఎంతో రాయలేదు. బరువు తక్కువగా ఉన్నా, ఎక్కువగా ఉన్నా గర్భం రావడం కష్టమవుతుంది. పెళ్లై మూడేళ్లు అయిపోయింది కాబట్టి ఒకసారి గైనకాలజిస్ట్‌ని సంప్రదించి, సంతానలేమికి సంబంధించిన పరీక్షలన్నీ అంటే.. అల్ట్రాసౌండ్‌ స్కాన్‌, హార్మోన్ల పరీక్షలు, ఫెలోపియన్ ట్యూబ్స్‌ చెక్‌ చేయడానికి హెచ్‌ఎస్‌జీ పరీక్షలు, మీ వారికి సెమెన్‌ అనాలసిస్‌.. వంటివన్నీ చేయించుకొని సలహా తీసుకోవాల్సి ఉంటుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్