హైపోథైరాయిడిజం ఉంటే పిల్లలు పుట్టరా?
హలో డాక్టర్. నా బరువు 40 కిలోలు. పెళ్లై మూడేళ్లయింది. నాకు హైపోథైరాయిడిజం ఉంది. ప్రస్తుతం 50 ఎంసీజీ ట్యాబ్లెట్స్ వాడుతున్నా. ఇది తప్పించి నాలో, మా వారిలో ఎలాంటి సమస్యలూ లేవు. అయినా నేను తల్లిని కాలేకపోతున్నా. ఏదైనా పరిష్కారముంటే....
హలో డాక్టర్. నా బరువు 40 కిలోలు. పెళ్లై మూడేళ్లయింది. నాకు హైపోథైరాయిడిజం ఉంది. ప్రస్తుతం 50 ఎంసీజీ ట్యాబ్లెట్స్ వాడుతున్నా. ఇది తప్పించి నాలో, మా వారిలో ఎలాంటి సమస్యలూ లేవు. అయినా నేను తల్లిని కాలేకపోతున్నా. ఏదైనా పరిష్కారముంటే చెప్పండి. - ఓ సోదరి
జ: హైపోథైరాయిడిజం ఉన్న వారికి డోసు సరిపోయిందా, లేదా తెలుసుకోవాలంటే గర్భం ధరించే ముందు ఒకసారి థైరాయిడ్ ప్రొఫైల్ పరీక్షలు చేయించుకోవాలి. టీఎస్‌హెచ్ 2.5 కంటే తక్కువగా ఉండేట్లు చూసుకుంటే గర్భం ధరించడానికి థైరాయిడ్ వల్ల సమస్య ఉండదు. మీరు బరువు 40 కిలోలు అన్నారు కానీ మీ ఎత్తు ఎంతో రాయలేదు. బరువు తక్కువగా ఉన్నా, ఎక్కువగా ఉన్నా గర్భం రావడం కష్టమవుతుంది. పెళ్లై మూడేళ్లు అయిపోయింది కాబట్టి ఒకసారి గైనకాలజిస్ట్‌ని సంప్రదించి, సంతానలేమికి సంబంధించిన పరీక్షలన్నీ అంటే.. అల్ట్రాసౌండ్ స్కాన్, హార్మోన్ల పరీక్షలు, ఫెలోపియన్ ట్యూబ్స్ చెక్ చేయడానికి హెచ్‌ఎస్‌జీ పరీక్షలు, మీ వారికి సెమెన్ అనాలసిస్.. వంటివన్నీ చేయించుకొని సలహా తీసుకోవాల్సి ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.