ఆ సమస్య ఉంటే పిల్లలు పుడతారా?

హలో డాక్టర్‌. నాకు పెళ్లై ఏడాదైంది. ఇంకా పిల్లల్లేరు. రెండు నెలలకోసారి పిరియడ్స్‌ వస్తున్నాయి. పెళ్లికి ముందు నుంచే ఈ సమస్య ఉంది. దీనివల్ల పిల్లలు పుట్టరేమోనని భయంగా ఉంది. నేను త్వరగా గర్భం ధరించే మార్గం చెప్పండి.

Published : 08 Jul 2021 14:58 IST

హలో డాక్టర్‌. నాకు పెళ్లై ఏడాదైంది. ఇంకా పిల్లల్లేరు. రెండు నెలలకోసారి పిరియడ్స్‌ వస్తున్నాయి. పెళ్లికి ముందు నుంచే ఈ సమస్య ఉంది. దీనివల్ల పిల్లలు పుట్టరేమోనని భయంగా ఉంది. నేను త్వరగా గర్భం ధరించే మార్గం చెప్పండి.

- ఓ సోదరి

జ: మీకు పిరియడ్స్‌ నెలనెలా రావట్లేదంటే బహుశా హార్మోన్ల అసమతుల్యత ఉందని అర్థం. ఇలాంటప్పుడు అండం విడుదల కూడా సక్రమంగా జరగదు. దానివల్ల పిల్లలు పుట్టడంలో కూడా సమస్య ఎదురుకావచ్చు. మీరు గైనకాలజిస్ట్‌ని సంప్రదిస్తే నెలసరి సరిగ్గా రాకపోవడానికి కారణమేంటో తెలుసుకోవడానికి పరీక్షలు చేస్తారు. అల్ట్రాసౌండ్‌ స్కాన్‌, హార్మోన్‌ ప్రొఫైల్‌ చేయడం ద్వారా మీకు వ్యాధి నిర్ధారణ జరిగితే దాన్ని బట్టి చికిత్స అందిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్