వక్షోజాల నుంచి నీరు కారుతోంది.. ఎందుకిలా?

హాయ్‌ డాక్టర్‌. నా వయసు 28 ఏళ్లు. నేను ఒకసారి అబార్షన్‌కి మందులు వాడాను. ఆ తర్వాత పిరియడ్స్‌ రెగ్యులర్‌గానే వచ్చాయి. కానీ ఈ మధ్య వక్షోజాల నుంచి నీరు కారుతోంది. ఎందుకిలా? ఇదేమైనా సమస్యా? దయచేసి చెప్పండి.

Published : 14 Oct 2021 16:45 IST

హాయ్‌ డాక్టర్‌. నా వయసు 28 ఏళ్లు. నేను ఒకసారి అబార్షన్‌కి మందులు వాడాను. ఆ తర్వాత పిరియడ్స్‌ రెగ్యులర్‌గానే వచ్చాయి. కానీ ఈ మధ్య వక్షోజాల నుంచి నీరు కారుతోంది. ఎందుకిలా? ఇదేమైనా సమస్యా? దయచేసి చెప్పండి.

- ఓ సోదరి

జ: వక్షోజాల నుంచి నీరు కానీ పాలు కానీ వస్తూ ఉంటే దానికి కారణం తెలుసుకోవడం మంచిది. ఇది ఒకవైపు మాత్రమే వస్తోందా? లేదంటే రెండు వైపుల నుంచి వస్తోందా? అనేది తెలియాలి. వక్షోజాలను పరీక్షించి చూడడంతో పాటు సోనో మామోగ్రామ్‌ (అల్ట్రాసౌండ్ ద్వారా వక్షోజాల్ని పరీక్షించడం), థైరాయిడ్‌, ప్రొలాక్టిన్‌.. వంటి హార్మోన్ల స్థాయులు పరీక్షించడం అవసరం. ఒక్కోసారి ఎసిడిటీకి వాడే కొన్ని మందుల (యాంటాసిడ్స్‌) వల్ల కూడా ఇలా జరగచ్చు. అలాంటప్పుడు ఆ మందులు వాడడం ఆపేస్తే సమస్య దానంతటదే తగ్గిపోతుంది. చాలా అరుదుగా పిట్యూటరీ గ్రంథిలో చిన్న గడ్డలు ఏర్పడితే కూడా ఈ పరిస్థితి రావచ్చు. కానీ ఒక్కసారి డాక్టర్‌తో పరీక్ష చేయించుకొని వారి సలహా పాటించడం ఉత్తమం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్