Updated : 19/10/2021 20:45 IST

ఒవేరియన్‌ డ్రిల్లింగ్‌ చేస్తే పిల్లలు పుడతారా?

హాయ్‌ డాక్టర్‌. నాకు 32 ఏళ్లు. బరువు 84 కిలోలు. నాకు పీసీఓఎస్‌ ఉంది. ప్రస్తుతం మందులు వాడుతున్నా. ఆహార నియమాలు పాటిస్తున్నా. అయినా బరువు తగ్గట్లేదు.. గర్భం దాల్చట్లేదు. డాక్టర్‌ ఒవేరియన్‌ డ్రిల్లింగ్‌ చేద్దామన్నారు. దీనివల్ల ఏవైనా సమస్యలొస్తాయా? లేదంటే ఐయూఐకి వెళ్లడం మంచిదా? సలహా ఇవ్వగలరు.

- ఓ సోదరి

జ: మీరు బరువు ఎక్కువగా ఉండడానికి, మీకు పీసీఓఎస్‌ సమస్య ఉండడానికి చాలా దగ్గరి సంబంధం ఉంది. ఈ క్రమంలో మీరు బరువు తగ్గడం చాలా ముఖ్యం. అయితే ఎంత ప్రయత్నించినా మీరు బరువు తగ్గడం లేదంటున్నారు కాబట్టి ఈ విషయంలో మీరు నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది. న్యూట్రిషనిస్ట్‌ని సంప్రదించి మీరు రోజుకు ఎన్ని క్యాలరీలు తినొచ్చన్నది తెలుసుకొని పాటించాలి. అలాగే వ్యాయామం చేయడం కూడా తప్పనిసరి!

ఇక ఒవేరియన్‌ డ్రిల్లింగ్‌ అనేది పీసీఓఎస్ ఉన్న ప్రతి ఒక్కరికీ చేసే ఆపరేషన్‌ కాదు. కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రమే చేస్తాం. ఉదాహరణకు.. బరువు తగ్గినా, అండం విడుదల కావడానికి మందులు వాడినా కూడా గర్భం నిలవకపోతే, అలాగే AMH హార్మోన్‌ స్థాయులు ఎక్కువగా ఉన్నా.. అటువంటి వారిని మాత్రమే ఒవేరియన్‌ డ్రిల్లింగ్‌కి ఎంచుకోవడం జరుగుతుంది. దాన్ని కూడా ల్యాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేకమైన పద్ధతిలో మాత్రమే చేయాలి. లేకపోతే అండాల నిల్వ తగ్గిపోవచ్చు. మీరు ఒవేరియన్‌ డ్రిల్లింగ్‌ మంచిదా, ఐయూఐకి వెళ్లడం మంచిదా అని అడుగుతున్నారు. ఈ రెండూ ఒకదానికొకటి ప్రత్యామ్నాయాలు కావు. ఐయూఐ చేయడానికి కొన్ని నిర్దిష్టమైన సూచనలు ఉంటాయి.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని