విపరీతంగా బ్లీడింగ్ అవుతోంది.. పరిష్కారమేంటి?

హలో డాక్టర్‌. నా వయసు 22. ఎత్తు 5’3’’. బరువు 55 కిలోలు. నాకు పీసీఓఎస్‌ ఉంది. డాక్టర్‌ మూడు నెలల కోర్సు ఇచ్చారు. ఈ కోర్సు పూర్తయిన తర్వాత రెండు నెలలు పిరియడ్స్‌ బాగానే వచ్చాయి. ఆ తర్వాత ఒక నెల పిరియడ్స్‌ రాలేదు. తర్వాతి నెలలో వచ్చినా బ్లీడింగ్‌ అవ్వలేదు. ఆపై నెలలో పిరియడ్స్‌ రెండు రోజుల ముందే వచ్చాయి..

Published : 06 Feb 2022 11:52 IST

హలో డాక్టర్‌. నా వయసు 22. ఎత్తు 5’3’’. బరువు 55 కిలోలు. నాకు పీసీఓఎస్‌ ఉంది. డాక్టర్‌ మూడు నెలల కోర్సు ఇచ్చారు. ఈ కోర్సు పూర్తయిన తర్వాత రెండు నెలలు పిరియడ్స్‌ బాగానే వచ్చాయి. ఆ తర్వాత ఒక నెల పిరియడ్స్‌ రాలేదు. తర్వాతి నెలలో వచ్చినా బ్లీడింగ్‌ అవ్వలేదు. ఆపై నెలలో పిరియడ్స్‌ రెండు రోజుల ముందే వచ్చాయి.. పది రోజుల పాటు బ్లీడింగ్‌ అయింది. కానీ ఇప్పుడు ఐదు రోజుల ముందే నెలసరి వచ్చింది.. బ్లీడింగ్‌ ఎక్కువగా ఉంది.. ఇలా పిరియడ్స్‌ విషయంలో రెగ్యులారిటీ అంటూ లేదు. బ్లీడింగ్‌ కూడా విపరీతంగా అవుతోంది.. నా సమస్యకు పరిష్కారమేంటి? - ఓ సోదరి

జ: మీకు ఇప్పటికే పీసీఓఎస్‌ ఉందని నిర్ధారణ జరిగింది. మీరు మూడు నెలల కోర్సు కూడా వాడానని రాశారు. అయితే పీసీఓఎస్‌ ఉన్న వారికి హార్మోన్ల అసమతుల్యత వల్ల నెలసరి ముందూ వెనుక గానీ, బ్లీడింగ్‌లో హెచ్చుతగ్గులు గానీ జరగొచ్చు. పీసీఓఎస్‌ అనేది కొద్ది నెలల చికిత్సతో పూర్తిగా నయమైపోయే వ్యాధి కాదు. ఈ అసమతుల్యత జీవితాంతం ఉంటుంది. అందుకని డాక్టర్ల పర్యవేక్షణలో దీర్ఘకాలికంగా చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్