అవాంఛిత రోమాలకు అదే కారణమా?

నమస్తే మేడమ్.. నా వయసు 18. ఎత్తు 5’1’’. బరువు 40 కిలోలు. నేను గత ఏడాది కాలంగా పీసీఓఎస్‌ సమస్యతో బాధపడుతున్నా. ఎనిమిది నెలల నుంచి Dronis 20, మూడు నెలల నుంచి Krimson 35 మాత్రలు వాడుతున్నా. బ్లీడింగ్ రెండు రోజులే అవుతుంది. ప్రస్తుతం నేను మాత్రలు వాడడం ఆపేశాను. 40 రోజుల నుంచి....

Published : 06 Apr 2022 17:30 IST

నమస్తే మేడమ్.. నా వయసు 18. ఎత్తు 5’1’’. బరువు 40 కిలోలు. నేను గత ఏడాది కాలంగా పీసీఓఎస్‌ సమస్యతో బాధపడుతున్నా. ఎనిమిది నెలల నుంచి Dronis 20, మూడు నెలల నుంచి Krimson 35 మాత్రలు వాడుతున్నా. బ్లీడింగ్ రెండు రోజులే అవుతుంది. ప్రస్తుతం నేను మాత్రలు వాడడం ఆపేశాను. 40 రోజుల నుంచి పిరియడ్స్‌ రాలేదు. నాకు థైరాయిడ్‌ కూడా లేదు. నా కాళ్లు, చేతులపై అవాంఛిత రోమాలున్నాయి. నా సమస్యేంటో తెలియాలంటే నేను ఆసుపత్రిలో ఏయే పరీక్షలు చేయించుకోవాలో సలహా ఇవ్వండి. - ఓ సోదరి

జ: మీరు మాత్రలు వాడడం ఆపేశాక తిరిగి పిరియడ్స్‌ రావట్లేదంటే పీసీఓఎస్‌ సమస్య అలాగే ఉందని అర్థం. అయితే ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉందో తెలుసుకోవడానికి అల్ట్రాసౌండ్‌ స్కాన్‌, మీ శరీరంలో ముఖ్యమైన హార్మోన్ల స్థాయులు పరీక్షించి చూడాలి. అందుకని మీరు ఒకసారి గైనకాలజిస్ట్‌కి చూపించుకోండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్