Updated : 06/08/2021 17:13 IST

ఇన్ని అనారోగ్యాల మధ్య నేను తల్లిని కాగలనా?

Image for Representation

హలో డాక్టర్‌. నా వయసు 29. ఎత్తు 4’9’’. బరువు 57 కిలోలు. నాకు పెళ్లై ఐదేళ్లవుతోంది. ఇప్పటికే 3 సార్లు అబార్షన్ అయింది. ఒకసారి నార్మల్‌గా అయింది.. రెండుసార్లు IUI ట్రీట్‌మెంట్‌ వల్ల అండంలో పెరుగుదల లేదని మూడో నెలలో అబార్షన్‌ చేశారు. నాకు ఇర్రెగ్యులర్‌ పిరియడ్స్‌ సమస్య ఉంది. ప్రస్తుతం నెలసరి రాక మూడు నెలలవుతోంది. ఫాలోపియన్‌ ట్యూబ్స్‌ టెస్ట్‌ చేస్తే.. ఎడమవైపు ట్యూబ్‌లో బ్లాక్‌ ఉందన్నారు. అలాగే నాకు పీసీఓఎస్‌, బీపీ, షుగర్‌ కూడా ఉన్నాయి. ఈ సమస్యలన్నీ అదుపులోకొచ్చి నేను తల్లిని కావాలంటే ఏం చేయాలో దయచేసి సలహా ఇవ్వగలరు.

- ఓ సోదరి

జ: మీకు పీసీఓఎస్‌ వల్ల అండం విడుదల కాకపోవడం, హార్మోన్ల అసమతుల్యత.. వంటి సమస్యలొస్తాయి. వీటికి తోడు ఒక ట్యూబ్‌లో బ్లాక్‌ కూడా ఉందని రాశారు. ఇకపోతే మీకు సంతానోత్పత్తి సమస్యలే కాకుండా.. హైబీపీ, షుగర్‌.. వంటివి కూడా ఉన్నాయి.. కాబట్టి ముందుగా మీరు ఒక అనుభవజ్ఞులైన ఫిజీషియన్‌ని సంప్రదించి బీపీ, షుగర్‌ అదుపులోకి తెచ్చుకోవాలి. గత మూడు నెలల సగటు షుగర్‌ స్థాయి 6 కానీ అంతకంటే తక్కువ గానీ వచ్చిన తర్వాతే మీరు పిల్లల కోసం ప్రయత్నించడం మంచిది.

ఇక గర్భం నిలిచిన తర్వాత కూడా మూడుసార్లు అబార్షన్‌ అయిందన్నారు. ఈ క్రమంలో మీకు గానీ, మీ వారికి గానీ ఇతర సమస్యలేవైనా ఉన్నాయేమో చూసుకొని.. ఆ తర్వాత ఐవీఎఫ్‌ పద్ధతి ద్వారా పిల్లల కోసం ప్రయత్నం చేయడం మంచిది. ఎందుకంటే తయారైన ఎంబ్రియోల్లో నుంచి PGD (Preimplantation genetic diagnosis) ద్వారా ఆరోగ్యంగా ఉన్న ఎంబ్రియోని గుర్తించి.. దాన్ని గర్భాశయంలోకి ప్రవేశపెట్టి.. గర్భవతిగా ఉన్నన్నాళ్లూ హైరిస్క్‌ ప్రెగ్నెన్సీ యూనిట్‌లో చూపించుకోవాల్సి ఉంటుంది. అలాగే బీపీ, షుగర్‌ అదుపులో ఉంచుకోవడమూ ముఖ్యమే. ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తే మీరు తల్లయ్యే అవకాశాలు మెరుగుపడతాయి.

మీకు సంబంధించిన ప్రశ్నను అడగడానికి ఇక్కడ క్లిక్‌ చేయండి...


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

మంచిమాట


'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్