రజస్వల అయ్యాక పిరియడ్స్ ఎప్పుడు రెగ్యులర్ అవుతాయి?
హాయ్ డాక్టర్. మా పాప వయసు 12 ఏళ్లు. 11 ఏళ్లకు రజస్వల అయింది. గత ఆరు నెలలుగా పిరియడ్స్ రాలేదు. ఇలా ఎందుకు అవుతుందో భయంగా ఉంది. దయచేసి....
హాయ్ డాక్టర్. మా పాప వయసు 12 ఏళ్లు. 11 ఏళ్లకు రజస్వల అయింది. గత ఆరు నెలలుగా పిరియడ్స్ రాలేదు. ఇలా ఎందుకు అవుతుందో భయంగా ఉంది. దయచేసి చెప్పండి. - ఓ సోదరి
జ: రజస్వల అయిన వెంటనే పిరియడ్స్ నెలనెలా రావాలని లేదు. అలా రావు కూడా! ఒక్కోసారి తిరిగి సంవత్సరం వరకు కూడా రాకపోవచ్చు. ఎందుకంటే నెలసరి సక్రమంగా రావడానికి అవసరమైన హెచ్‌పీవో యాక్సిస్ (హైపోథాలమిక్ పిట్యుటరీ ఒవేరియన్ యాక్సిస్) సక్రమంగా పనిచేయడం నేర్చుకోవడానికి, శరీరంలో ఈ మార్పులన్నీ రావడానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి మీరేమీ కంగారు పడకుండా పాపకు 14 ఏళ్లు వచ్చే వరకు నిశ్చింతగా ఉండచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.