అక్కడ మంట, దురద.. ఎందుకిలా ?

హలో మేడమ్‌. నాకు ఐదు నెలల బేబీ ఉంది. బిడ్డ పుట్టిన నాలుగో నెలలో పిరియడ్స్ వచ్చాయి. అప్పట్నుంచి నాకు వెజైనా దగ్గర విపరీతమైన దురద, మంటగా ఉంటోంది. అసలు నాకెందుకిలా జరుగుతోంది? దయచేసి చెప్పండి. - ఓ సోదరి

Published : 29 Dec 2021 20:41 IST

హలో మేడమ్‌. నాకు ఐదు నెలల బేబీ ఉంది. బిడ్డ పుట్టిన నాలుగో నెలలో పిరియడ్స్ వచ్చాయి. అప్పట్నుంచి నాకు వెజైనా దగ్గర విపరీతమైన దురద, మంటగా ఉంటోంది. అసలు నాకెందుకిలా జరుగుతోంది? దయచేసి చెప్పండి. - ఓ సోదరి

జ: వెజైనా దగ్గర దురద, మంట అంటే అత్యంత సాధారణమైన కారణం వెజైనల్‌ ఇన్ఫెక్షన్‌. ఇది ఫంగస్‌ వల్ల కానీ ట్రైకోమోనాస్‌ వల్ల కానీ లేదా బ్యాక్టీరియా వల్ల కానీ వస్తుండచ్చు. లేదా ఒక్కోసారి డెర్మటైటిస్‌ వంటి చర్మ వ్యాధులు, అలర్జీలు కూడా ఇందుకు కారణం కావచ్చు. అందుకని మీరు ఒకసారి గైనకాలజిస్ట్‌ని సంప్రదిస్తే వ్యాధి నిర్ధారణ కోసం అవసరమైన పరీక్షలు చేసి, తగిన మందులు సూచించగలుగుతారు.

- డా|| వై. సవితాదేవి, గైనకాలజిస్ట్‌

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్