ఛాతీలో నొప్పి.. బ్రౌన్‌ కలర్ డిశ్చార్జ్.. ఎందుకిలా?

మేడమ్.. నా వయసు 52. నాకు ఏడాదిన్నర నుంచి పిరియడ్స్‌ సరిగ్గా రావట్లేదు. ఈసారి నాలుగు నెలల నుంచి నెలసరి రాలేదు. దీంతో పాటు ఛాతీలో నొప్పి, వైట్‌ డిశ్చార్జ్ అవుతోంది. ఒక్కోసారి బ్రౌన్‌ కలర్‌లో డిశ్చార్జ్‌ కనిపిస్తోంది. ఎందుకిలా....

Published : 19 Mar 2022 17:28 IST

మేడమ్.. నా వయసు 52. నాకు ఏడాదిన్నర నుంచి పిరియడ్స్‌ సరిగ్గా రావట్లేదు. ఈసారి నాలుగు నెలల నుంచి నెలసరి రాలేదు. దీంతో పాటు ఛాతీలో నొప్పి, వైట్‌ డిశ్చార్జ్ అవుతోంది. ఒక్కోసారి బ్రౌన్‌ కలర్‌లో డిశ్చార్జ్‌ కనిపిస్తోంది. ఎందుకిలా జరుగుతుంది? సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

జ. ఇలాంటి లక్షణాలు యుక్తవయసులో అయితే ప్రెగ్నెన్సీ గురించి ఆలోచిస్తాం. కానీ మీ వయసు 52 కాబట్టి ఇది హార్మోన్లు తగ్గిపోవడం వల్ల మెనోపాజ్‌ దశకు సూచన కావచ్చు. కానీ డిశ్చార్జి కనపడిందంటే ఇతర సమస్యలు కూడా ఉండి ఉండచ్చు. అందుకే మీరు ఒకసారి డాక్టర్‌ను సంప్రదించి పాప్‌స్మియర్‌, అల్ట్రాసౌండ్‌ స్కాన్‌ టెస్టుల ద్వారా గర్భసంచి, అండాశయాలు.. వంటివన్నీ పరీక్షించి చూసుకోవాలి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్