జుట్టు ఆరోగ్యం.. మన చేతుల్లోనే..!
అందమంటే చర్మ సౌందర్యమే కాదు.. శిరోజాల సంరక్షణ కూడా! అయితే ఈ రోజుల్లో వాతావరణ కాలుష్యంతో పాటు మనం చేసే కొన్ని పొరపాట్లు జుట్టు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ఫలితంగా కేశాలు ఎక్కువగా రాలిపోవడం, చిన్న వయసులోనే తెల్ల వెంట్రుకలు రావడం.. వంటి సమస్యలు
అందమంటే చర్మ సౌందర్యమే కాదు.. శిరోజాల సంరక్షణ కూడా! అయితే ఈ రోజుల్లో వాతావరణ కాలుష్యంతో పాటు మనం చేసే కొన్ని పొరపాట్లు జుట్టు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ఫలితంగా కేశాలు ఎక్కువగా రాలిపోవడం, చిన్న వయసులోనే తెల్ల వెంట్రుకలు రావడం.. వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. అందుకే ఈ సమస్యలేవీ లేకుండా ఉండాలంటే జుట్టు ఆరోగ్యానికి ఈ చిట్కాలు పాటించడం మేలంటున్నారు నిపుణులు.
* శరీరానికే కాదు.. శిరోజాల సంరక్షణకు కూడా ఆరోగ్యకరమైన జీవనశైలి తప్పనిసరి. ఇందులో భాగంగా మంచినీళ్లు ఎక్కువగా తీసుకోవాలి. దీనివల్ల శరీరంలో నీటి స్థాయులు పెరగడమే కాకుండా చర్మంలోని మలినాలు, వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి. ఫలితంగా కుదుళ్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇది జుట్టు ఎదుగుదలకు, దృఢత్వానికి మేలు చేస్తుంది.
* విటమిన్ల లోపం కూడా జుట్టుపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అలా జరగకుండా ఉండాలంటే ప్రొటీన్లు, బయోటిన్.. వంటివి ఎక్కువగా లభించే గుడ్డు, ఆకుకూరలు, పెరుగు.. వంటివి ఆహారంలో చేర్చుకోవాలి. మరీ అత్యవసరమైతే.. నిపుణుల సలహా మేరకు ఆయా విటమిన్ సప్లిమెంట్స్, బయోటిన్, ఒమేగా-3 ఫిష్ ఆయిల్ ట్యాబ్లెట్స్ వాడాలి. ఇందులోని పోషకాలు జుట్టు ఆరోగ్యంగా ఎదిగేందుకు సహకరిస్తాయి.
* జుట్టు ఆరోగ్యంగా పెరగాలంటే నిర్ణీత వ్యవధుల్లో చివర్లు కత్తిరించడం ముఖ్యం.
* తలస్నానం చేసిన తర్వాత సాధ్యమైనంత వరకు జుట్టును సహజంగానే ఆరనివ్వాలి. అలా కాకుండా వేడి ఎక్కువగా ఉత్పత్తి చేసే హెయిర్ డ్రయర్స్ వాడితే కుదుళ్లలో దురద, అలర్జీలు, జుట్టు చివర్లు చిట్లడం... వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇవీ జుట్టు, కుదుళ్ల ఆరోగ్యానికి ప్రతిబంధకాలే!
* అలాగే తలస్నానం చేశాక జుట్టును తుడుచుకునేందుకు రెగ్యులర్ టవల్స్ బదులు మైక్రోఫైబర్ ర్యాపర్స్ను వినియోగిస్తే మేలంటున్నారు నిపుణులు.
* తలస్నానానికి బాగా వేడిగా ఉండే నీళ్లు ఉపయోగించడం వల్ల జుట్టు కుదుళ్లకు నష్టం కలుగుతుంది. కాబట్టి గోరువెచ్చని నీటినే తలస్నానానికి ఉపయోగించాలి. అలాగే గాఢత తక్కువగా ఉండే షాంపూలు మేలు చేస్తాయి. ఇక షాంపూ చేసుకున్నాక కండిషనర్ను రాసుకోవడం మర్చిపోవద్దు.
* తలస్నానం చేసిన వెంటనే జుట్టును దువ్వకూడదు. అలా చేస్తే వెంట్రుకలు తెగిపోవడం, ఎక్కువ జుట్టు రాలిపోవడం... వంటి సమస్యలొస్తాయి. అలాగే జుట్టు దువ్వుకోవడానికి కూడా మెత్తటి బ్రిజిల్స్ ఉండే చెక్క దువ్వెనను ఉపయోగించడం ఉత్తమం.
* చల్లటి ప్రదేశాలకు వెళ్లినప్పుడు ఉన్నితో తయారుచేసిన టోపీలతో జుట్టును కవర్ చేసుకోవాలి. లేకపోతే చల్లటి గాలులు కురులకు నష్టం కలిగిస్తాయి.
* మసాజ్ కూడా కుదుళ్ల, జుట్టు ఆరోగ్యాన్ని పెంచుతుంది. కాబట్టి కనీసం వారానికోసారైనా గోరువెచ్చటి నూనెతో మర్దన చేసుకోవడం/చేయించుకోవడం మంచిది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- నాకు ఏ క్రీమ్?
- ఇలా చేస్తే.. అందం తగ్గదు..!
- స్ట్రెచ్ మార్క్స్.. తగ్గట్లేదా..?
- గోటితోనే పోదు మరి!
- కొత్తందాల క్రాప్ టాప్
ఆరోగ్యమస్తు
- ఉత్తేజంగా మారాలంటే..!
- రక్తహీనత తగ్గించే బీట్రూట్!
- మీ స్కోరెంత?
- ఇంటిలోనే వ్యాయామం...
- బరువు తగ్గించే నల్లబియ్యం!
అనుబంధం
- అలా చదివితే మేలే...
- చిన్నవే... చక్కదిద్దుతాయి!
- యుక్త వయసు నుంచీ...!
- పాప వల్ల నాతో ఆ సంతోషం ఉండట్లేదంటున్నారు..!
- వధువుకి... నమస్కారం!
యూత్ కార్నర్
- భూగోళాన్ని చుట్టేస్తానంటోంది!
- దాంతో మాట్లాడుతుంటే మతి పోయిందనేవాళ్లు!
- ఎరీ... ఆ ఊరి పట్టు..!
- అందరికీ నచ్చేవి.. నాకు నచ్చవు.. ఎందుకిలా?
- తెల్లజుట్టు... కారణమేంటి?
'స్వీట్' హోం
- కళ్లు తిరిగే కార్పెట్లు...
- ఆ చోటు గుర్తిస్తే చాలు...
- చిన్నారుల చిత్రకళా ప్రదర్శన..!
- అద్దమూ మెరవాలిగా..!
- దుమ్ము బాధ పోవాలంటే..!
వర్క్ & లైఫ్
- ఇవి టైంపాస్ కోసమే కాదు.. సంపాదనకూ..!
- మారాలని గట్టిగా అనుకోండి!
- Samantha: చిన్న చిట్కాలతోనే 45 కిలోల బరువు తగ్గా..!
- ఆఫీసులో ఇలా చేస్తున్నారా?
- అయితే... నేలపై పడుకోండి!