జుట్టు రాలుతోందా?

చలిగాలులకు జుట్టు అట్టకట్టినట్లుగా అవుతుంది. కొంతమందిలో జుట్టు ఎక్కువగా రాలిపోతుంటుంది. ఇలా కాకుండా ఉండాలంటే రోజూ రాత్రి నిద్రపోయే ముందు విటమిన్ 'ఇ' ఉన్న నూనెని రాసుకోవాలి. అలాగే బయటకు వెళ్లేటప్పుడు జుట్టుని కూడా కవర్....

Published : 27 Dec 2022 18:46 IST

చలిగాలులకు జుట్టు అట్టకట్టినట్లుగా అవుతుంది. కొంతమందిలో జుట్టు ఎక్కువగా రాలిపోతుంటుంది. ఇలా కాకుండా ఉండాలంటే రోజూ రాత్రి నిద్రపోయే ముందు విటమిన్ 'ఇ' ఉన్న నూనెని రాసుకోవాలి. అలాగే బయటకు వెళ్లేటప్పుడు జుట్టుని కూడా కవర్ చేసేలా స్కార్ఫ్, టోపీ.. ఇలా ఏదో ఒకటి విధిగా ధరించాలి. ఒకవేళ బయట ఉన్నప్పుడు ఈ పరిస్థితి ఎదురైతే మీ దగ్గర ఉన్న బాడీలోషన్ కొద్దిగా తీసుకుని రెండు చేతులకూ రుద్దుకోవాలి. తర్వాత ఆ చేతుల మధ్య జుట్టు ఉంచి మెల్లగా రుద్దాలి. ఇలా చేయడం వల్ల శిరోజాల పెళుసుదనం పోయి, ప్రకాశవంతంగా మారతాయి. అలాగే జుట్టు రాలకుండా ఈ కింది చిట్కాలు కూడా ప్రయత్నించవచ్చు అని సూచిస్తున్నారు నిపుణులు.

జుట్టు రాలకుండా..

ఒక అరటిపండు తీసుకుని దానిని మెత్తని గుజ్జులా చేసుకోవాలి. దీనికి కొద్దిగా ఆలివ్ ఆయిల్ లేదా బాదం నూనె జత చేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి 20 నుంచి 25 నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. అరటిపండులోని సుగుణాల వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది.

నిమ్మతో కేవలం చుండ్రు దూరం కావడమే కాదు జుట్టు రాలడం కూడా తగ్గుతుంది. నిమ్మరసాన్ని ఏదైనా హెయిర్ మాస్క్‌కు జత చేయచ్చు. లేదంటే కొద్దిగా పెరుగు తీసుకుని అందులో కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి జుట్టుకు రాసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల కూడా సమస్యకు చక్కని పరిష్కారం లభిస్తుంది.

మందార పూలను ముద్దగా చేసి అందులో రెండు లేదా మూడు చుక్కల బాదం నూనె, 2 చెంచాల ఉసిరి పొడి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు రాసుకుని షవర్ క్యాప్ పెట్టుకోవాలి. ఇలా రెండు గంటల పాటు ఆరనిచ్చి తర్వాత గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకుని, తక్కువ గాఢత గల షాంపూతో తలస్నానం చేయాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్