‘పెరుగు’తో మెరిసే జుట్టు!

ఎన్ని కండిషనర్లు రాసుకున్నా జుట్టు మళ్లీ పొడిగానే తయారవుతోందా? జుట్టు చివర్లు చిట్లిపోయి.. జుట్టంతా డ్యామేజ్ అవుతోందా? చుండ్రుతో వెంట్రుకలు బలహీనమై ఎక్కువగా రాలిపోతున్నాయా? అయితే వీటన్నింటినీ పరిష్కరించడానికి ఓ సహజసిద్ధమైన మార్గం ఉంది. అదేంటంటే....

Published : 29 May 2023 20:13 IST

ఎన్ని కండిషనర్లు రాసుకున్నా జుట్టు మళ్లీ పొడిగానే తయారవుతోందా? జుట్టు చివర్లు చిట్లిపోయి.. జుట్టంతా డ్యామేజ్ అవుతోందా? చుండ్రుతో వెంట్రుకలు బలహీనమై ఎక్కువగా రాలిపోతున్నాయా? అయితే వీటన్నింటినీ పరిష్కరించడానికి ఓ సహజసిద్ధమైన మార్గం ఉంది. అదేంటంటే.. 'పెరుగుతో హెయిర్ ప్యాక్స్'. పెరుగులో ఉండే పోషకాలు జుట్టుకు మంచి కండిషనర్‌గా పనిచేసి వెంట్రుకలకు బలాన్ని, మెరుపునూ ఇస్తాయి. అలాగే ఈ ప్యాక్స్ ఎండ, కాలుష్యాల నుంచి కూడా జుట్టును కాపాడడంలో సహాయపడతాయి. ఈ క్రమంలో పెరుగుతో ఇంట్లోనే సులభంగా తయారు చేసుకునే హెయిర్ ప్యాక్స్ ఏంటో చూసేద్దామా?

తేనెతో షైనీగా..

జుట్టు ఆరోగ్యంగా, మెరుస్తూ ఉండాలంటే ఈ ప్యాక్ వేసుకోవడం మంచిది.
కావాల్సినవి
 గడ్డ పెరుగు - ఒక కప్పు
 నిమ్మరసం - ఒక చెంచా
 తేనె - ఒక చెంచా

ప్యాక్ ఇలా!
ముందుగా గడ్డ పెరుగులో నిమ్మరసం, తేనె వేసి పేస్ట్ లాగా అయ్యేంతవరకూ కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకూ అప్త్లె చేసుకోవాలి. అరగంట తర్వాత షాంపూతో తలస్నానం చేసి కండిషనర్ రాసుకోవాలి. ఫలితంగా జుట్టుకు మెరుపు రావడంతో పాటు ఆరోగ్యంగా తయారవుతుంది.
 వారానికి రెండుసార్లు ఈ ప్యాక్ వేసుకోవచ్చు.


ఆలివ్ ఆయిల్‌తో..

మాడంతా పొడిగా అయిపోయి.. చుండ్రు సమస్యతో బాధపడుతున్నారా? అయితే డోంట్‌వర్రీ.. ఈ ప్యాక్ ఓసారి ప్రయత్నిస్తే సరిపోతుంది.
కావాల్సినవి
 గడ్డ పెరుగు - ఒక కప్పు
 ఆలివ్ ఆయిల్ - మూడు చెంచాలు
ప్యాక్ ఇలా!
ముందుగా ఒక కప్పు పెరుగు తీసుకొని అందులో ఆలివ్ నూనె వేసి బాగా కలుపుకోవాలి. దీనిలోంచి కాస్త మిశ్రమాన్ని మాడుపై వేసి ఓ పది నిమిషాల పాటు గుండ్రంగా మసాజ్ చేసుకోవాలి. తర్వాత మిగిలిన పేస్ట్‌తో జుట్టు మొత్తం కింది వరకూ ప్యాక్ లాగా వేసుకోవాలి. అరగంట తర్వాత షాంపూతో శుభ్రంగా తలస్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
 వారానికి రెండుసార్లు ఈ ప్యాక్ వేసుకుంటే మరింత మెరుగైన ఫలితం ఉంటుంది.


మృదువైన కురుల కోసం..

జుట్టు పొడిగా ఉంటే ఎంత అసౌకర్యంగా ఉంటుందో కదూ! మరి ఇలాంటి కురులను మృదువుగా, తేమ నిలిచి ఉండేలా తయారు చేసుకోవాలంటే ఈ ప్యాక్ ప్రయత్నించచ్చు.

కావాల్సినవి
 గడ్డ పెరుగు - ఒక కప్పు
ప్యాక్ ఇలా!
గడ్డ పెరుగు తీసుకుని పేస్ట్ లాగా అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి. ఇలా తయారైన పేస్ట్‌ను జుట్టుకు, మాడుకు పట్టించి ఒక మాస్క్‌లాగా వేసుకోవాలి. తర్వాత తల చుట్టూ కాటన్ టవల్ చుట్టుకొని అరగంట పాటు అలాగే ఉంచుకోవాలి. తర్వాత షాంపూతో తలస్నానం చేసి కండిషనర్ రాసుకోవాలి. దీనివల్ల జుట్టు మృదువుగా తయారవడంతో పాటు మెరుపు కూడా వస్తుంది.
✬ నార్మల్ హెయిర్ ఉన్న వారు వారానికోసారి, పొడి జుట్టు ఉన్న వారు వారానికి రెండుసార్లు ఈ ప్యాక్ ట్రై చేయడం మంచిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్