Hamsa Nandini: కీమోథెరపీ పూర్తయింది.. కానీ!
జీవితమంటేనే కష్టసుఖాల సంగమం. సుఖాల్ని ఎంత ఆనందంగా స్వీకరిస్తామో.. కష్టాలకూ అంతే సానుకూలంగా స్పందించాలి. అప్పుడే ప్రతికూల పరిస్థితుల్నీ ధైర్యంగా ఎదుర్కోగలం. తాజాగా ఇదే విషయాన్ని నిరూపించింది టాలీవుడ్ బ్యూటీ హంసానందిని. తాను రొమ్ము క్యాన్సర్‌తో పోరాడుతున్నానని గతేడాది డిసెంబర్లో వెల్లడించి అందరినీ షాక్‌కి గురిచేసిన ఈ అందాల తార....
(Photo: Instagram)
జీవితమంటేనే కష్టసుఖాల సంగమం. సుఖాల్ని ఎంత ఆనందంగా స్వీకరిస్తామో.. కష్టాలకూ అంతే సానుకూలంగా స్పందించాలి. అప్పుడే ప్రతికూల పరిస్థితుల్నీ ధైర్యంగా ఎదుర్కోగలం. తాజాగా ఇదే విషయాన్ని నిరూపించింది టాలీవుడ్ బ్యూటీ హంసానందిని. తాను రొమ్ము క్యాన్సర్‌తో పోరాడుతున్నానని గతేడాది డిసెంబర్లో వెల్లడించి అందరినీ షాక్‌కి గురిచేసిన ఈ అందాల తార.. తన చికిత్సకు సంబంధించిన తాజా అప్డేట్ ఇచ్చింది. ఈ క్రమంలోనే కీమోథెరపీ విజయవంతంగా పూర్తయిందని.. అయితే క్యాన్సర్ నుంచి పూర్తిగా విముక్తి పొందడానికి ఇంకాస్త సమయం పడుతుందంటూ తాజాగా ఇన్‌స్టాలో ఓ పోస్ట్ పెట్టింది హంస. తాను క్యాన్సర్‌ను జయించే క్రమంలో సక్సెస్‌ఫుల్‌గా ఓ అడుగు ముందుకేసిన ఆమె తెగువను చాలామంది ప్రశంసిస్తున్నారు. ‘ఫైటర్’ అంటూ కామెంట్లు షేర్ చేస్తున్నారు.
నటిగా, మోడల్‌గా, డ్యాన్సర్‌గా తెలుగు తెరపై మంచి పేరు తెచ్చుకుంది హంసా నందిని. పలు ప్రత్యేక గీతాలతో, కొన్ని సినిమాల్లో అతిథి పాత్రలతో అలరించింది. అయితే 2018 తర్వాత సినిమాలకు దూరమైన ఆమె.. ఆపై తన యూట్యూబ్ ఛానల్‌తో అందరికీ దగ్గరైంది. ఇటీవలే రొమ్ము క్యాన్సర్ బారిన పడిన ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం చికిత్స తీసుకుంటోంది. ఈ క్రమంలోనే తనకు 16 పర్యాయాల కీమోథెరపీ విజయవంతంగా పూర్తయిందంటూ తాజాగా తన క్యాన్సర్ చికిత్స గురించి ఇన్‌స్టాలో ఓ పోస్ట్ పెట్టింది.
హంస.. ది ‘ఫైటర్’!
చికిత్సలో భాగంగా ఆస్పత్రిలో గుండుతో దిగిన ఫొటోల్ని పంచుకున్న హంస.. ‘క్యాన్సర్ చికిత్సలో భాగంగా నాకు 16 పర్యాయాల కీమోథెరపీ విజయవంతంగా పూర్తయింది. అయితే కీమోను జయించినంత మాత్రాన క్యాన్సర్‌ను ఓడించినట్లు కాదు. ఇందుకోసం నేను మరో యుద్ధానికి సిద్ధమవుతున్నా. శస్త్రచికిత్సలకు సమయం ఆసన్నమైంది..’ అంటోందీ బ్రేవ్ బ్యూటీ.
సానుకూల దృక్పథం, నిండైన ఆత్మవిశ్వాసంతో కీమోను జయించిన హంసను నెటిజన్లంతా ‘ఫైటర్’ అంటూ ప్రశంసిస్తున్నారు. ‘క్యాన్సర్ చికిత్సలో అత్యంత క్లిష్టమైన కీమోథెరపీనే జయించారు.. ఇదే ధైర్యాన్ని చివరి వరకు కొనసాగించి ఈ మహమ్మారిని ఓడించండి..’ అంటూ తమ కామెంట్లతో ఆమెలో ప్రోత్సాహం నింపుతున్నారు. ఇలా ఓవైపు క్యాన్సర్ చికిత్స తీసుకుంటూనే మరోవైపు గుండుతోనే పలు ప్రకటనల్లోనూ నటిస్తోందీ టాలీవుడ్ అందం.
ఆ భయంతోనే ఇన్నాళ్లూ..!
తాను రొమ్ము క్యాన్సర్ బారిన పడిన విషయాన్ని గతేడాది డిసెంబర్లో ఓ సుదీర్ఘ పోస్ట్ రూపంలో పంచుకుంది హంస.
‘జీవితం నాకు ఎన్ని సవాళ్లు విసిరినా, అది నా పట్ల ఎంత కఠినంగా వ్యవహరించినా.. నేను దానికి బాధితురాలిని కాదల్చుకోలేదు. అనుక్షణం భయంతో, నిరాశతో, ప్రతికూల భావనలతో కుంగిపోవాలనుకోవట్లేదు. ప్రేమతో, ధైర్యంతో ఈ గడ్డు దశను దాటి ముందుకు వెళ్లాలనుకుంటున్నా. 18 ఏళ్ల క్రితం మా అమ్మ రొమ్ము క్యాన్సర్‌తో చనిపోయింది. ఇన్నాళ్లూ ఆ ప్రతికూలతల్లోనే బతికాను. నాలుగు నెలల క్రితం నా రొమ్ములో గడ్డ తగలగానే మనసులో ఏదో తెలియని భయం ఆవహించింది. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదని ఆ క్షణం నాకు అర్థమైంది.
ఆనందం క్షణాల్లో ఆవిరైపోయింది!
సమస్యను నిర్ధారించుకోవడానికి పరీక్షలు చేయించుకున్నా. నా భయమే నిజమైంది. ‘Grade 3 Invasive Carcinoma (Breast Cancer)’ ఉందని తేలింది. కొన్ని పరీక్షలు, స్కాన్ల అనంతరం నా రొమ్ములోని కణితిని ఆపరేషన్ ద్వారా తొలగించారు వైద్యులు. ఇది భవిష్యత్తులో తిరిగి వ్యాప్తి చెందదని తేల్చి చెప్పారు. త్వరగా గుర్తించడం వల్లే ముప్పు తప్పిందని సంతోషపడ్డా. కానీ నా ఆనందం నిమిషాల్లోనే ఆవిరైపోయింది. ఎందుకంటే BRCA1 (వంశపారంపర్య రొమ్ము క్యాన్సర్) పరీక్షలో నాకు పాజిటివ్ అని తేలింది. అంటే.. దీని జన్యు పరివర్తన కారణంగా నాకు భవిష్యత్తులో.. 70 శాతం రొమ్ము క్యాన్సర్, 45 శాతం అండాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం కచ్చితంగా పొంచి ఉందని చెప్పారు వైద్యులు. అయితే ఈ ముప్పును తగ్గించడానికి కొన్ని విస్తృత రోగనిరోధక శస్త్రచికిత్సలు చేయించుకోవాల్సి ఉంటుంది.
అందుకే ఈ ప్రమాణాలు!
అయితే ఈ వ్యాధిని జయించే క్రమంలో నాకు నేను కొన్ని ప్రమాణాలు చేసుకున్నా.
* ముందుగా ఈ మహమ్మారికి నన్ను జయించే అవకాశం, నా జీవితాన్ని శాసించే అధికారం ఇవ్వాలనుకోవట్లేదు. చిరునవ్వుతో, ఆత్మవిశ్వాసంతో ఈ యుద్ధాన్ని గెలవాలనుకుంటున్నా.
* త్వరలోనే కోలుకొని రెట్టింపు ఉత్సాహంతో తిరిగి తెరపైకి రావాలనుకుంటున్నా.
* జీవితం చాలా విలువైంది. దాన్ని మనసారా ఆస్వాదించాలనుకుంటున్నా.
* ఇలాంటి మహమ్మారులతో పోరాటం చేస్తోన్న బాధితుల్లో స్ఫూర్తి నింపడానికే నా కథను పంచుకుంటున్నా.
ప్రేమతో,
మీ హంస..’ అంటూ అప్పట్లో తన క్యాన్సర్ కథను పంచుకుందీ బ్రేవ్ బ్యూటీ.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- వార్థక్యపు ఛాయలు లేకుండా..!
- హెయిర్ బన్.. స్టైలిష్‌గా వేసేద్దాం!
- సన్‌స్క్రీన్... పౌడర్‌లో!
- వేసవిలో వీటి విషయంలో జాగ్రత్త!
- వ్యాయామం వల్ల మొటిమలు రాకుండా..!
ఆరోగ్యమస్తు
- నిద్ర లేకపోయినా.. నీరసించిపోకుండా!
- రాగుల్లో దాగున్న ‘ఆరోగ్యం’!
- వేరుశనక్కాయలు తింటే... ధ్యానం చేసినట్లే!
- తేలిగ్గా తీసుకోవద్దు!
- ప్రసవానంతరం పొట్టను ఇలా తగ్గించుకుందాం!
అనుబంధం
- అనుమానంతో.. నా ఫోన్ హ్యాక్ చేశాడా?
- పోనీ ఇలా చెప్పి చూద్దామా?
- పెళ్లికి ముందు సరేనన్నాడు.. ఇప్పుడు వద్దంటున్నాడు!
- నో చెప్పండిలా!
- అనుమానిస్తున్నాడని నిరూపించేదెలా?
యూత్ కార్నర్
- Miss Universe : ఈ ముద్దుగుమ్మదే.. ఆ ఘనత!
- ఆ చక్రాలని నడిపించేది వాళ్లే!
- దాచగలరు..!
- మన గచ్చకాయలాట... కొరియాలో!
- విరాళాలకు వారధిగా.. ఆమె సేవలు!
'స్వీట్' హోం
- వేసవిలో.. పండ్లు, కూరలు పాడవకుండా..!
- వేసవిలో.. ఇల్లు చల్లగా!
- గోవర్ధనాల గుబాళింపు!
- ఇనుప కడాయిలో ఇవొద్దు!
- Green Vegetables : వీటిని ఎలా వండుతున్నారు?
వర్క్ & లైఫ్
- ఒక్క రోజులోనే.. ఒంటరిగా.. ఆ ప్రాంతాలన్నీ చుట్టేశా!
- ఆ అల్లరి పిల్లే ఇప్పుడు టీచరైంది.. ఈ స్టూడెంట్-టీచర్ కథ చదివారా?!
- ప్రయాణాలకు... చిన్ని సాయాలు!
- ఆర్థికంగా ఎదగాలంటే...
- ఇది మహిళల హోలీ.. మగాళ్లకు నో ఎంట్రీ!