నా భర్తకు.. మహిళల లోదుస్తులు వేసుకోవడమంటే ఇష్టం..!

నా పెళ్లై రెండేళ్లవుతోంది. మొదటి ఆరు నెలల వరకు మా ఇద్దరి మధ్య ఎలాంటి సమస్యా లేదు. ఆ తర్వాత నా భర్త నుంచి ఓ అనూహ్యమైన పరిస్థితి ఎదురైంది. ఒకరోజు నాతో ‘పెద్ద సైజు ‘బ్రా’ తెస్తావా’? అనడిగాడు. ఎందుకని అడిగితే సమాధానం చెప్పలేదు. అయినా నా భర్త కోరిక మేరకు బ్రా తెచ్చి పెట్టాను.

Published : 22 Jun 2024 13:00 IST

(Representational Image)

నా పెళ్లై రెండేళ్లవుతోంది. మొదటి ఆరు నెలల వరకు మా ఇద్దరి మధ్య ఎలాంటి సమస్యా లేదు. ఆ తర్వాత నా భర్త నుంచి ఓ అనూహ్యమైన పరిస్థితి ఎదురైంది. ఒకరోజు నాతో ‘పెద్ద సైజు ‘బ్రా’ తెస్తావా’? అనడిగాడు. ఎందుకని అడిగితే సమాధానం చెప్పలేదు. అయినా నా భర్త కోరిక మేరకు బ్రా తెచ్చి పెట్టాను. ఆశ్చర్యకరంగా రాత్రి సమయంలో నేను తెచ్చిన బ్రా ధరించాడు. అంతేకాకుండా నా లోదుస్తులను కూడా వేసుకున్నాడు. అయితే ఇవన్నీ ఇద్దరం ఏకాంతంగా ఉన్నప్పుడు మాత్రమే చేస్తుంటాడు. ఇది నాకు చాలా వింతగా అనిపించింది. ఇదే విషయాన్ని నా భర్తతో చెప్పాను. అందుకు ఆయన ‘దీని గురించి పెద్దగా ఆలోచించకు’ అంటూ తన స్నేహితులకు సంబంధించిన కొన్ని ఉదాహరణలు చెప్పాడు. ఇలా ఏడాది గడిచిపోయింది. ఇప్పటికీ ఆయన నా లోదుస్తులు ధరించడాన్ని ఎంజాయ్‌ చేస్తుంటాడు. ఇలాంటి ప్రవర్తన సాధారణమైనదేనా? లేదంటే నేనే అతిగా ఆలోచిస్తున్నానా? దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

జ. దాంపత్యంలో శృంగారం కీలకపాత్ర పోషిస్తుంది. ఈ క్రమంలోనే కొంతమంది దంపతులు తమ శృంగార జీవితంలో కొత్త ప్రయోగాలు చేస్తూ దాంపత్య బంధాన్ని దృఢంగా మార్చుకుంటుంటారు. అయితే ఇలాంటి ప్రయోగాలు ఇరువురికీ ఆమోదయోగ్యంగా ఉండడంతో పాటు; మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడకుండా చూసుకోవడం ఎంతో అవసరం.

ఇక మీ భర్త విషయానికి వస్తే.. అతను మీతో ఏకాంతంగా ఉన్న సమయంలో ఇలాంటి ప్రవర్తన కనబరుస్తున్నాడని చెబుతున్నారు. ఈ క్రమంలో అతను తన సంతోషాన్ని వెతుక్కుంటున్నాడని అర్థమవుతోంది. సాధారణంగా కొంతమంది ఏకాంతంగా ఉన్నప్పుడు ఇలాంటి కోరికలను నెరవేర్చుకుంటుంటారు. మీ విషయంలోనూ ఇదే జరుగుతోంది. అయితే ఇలాంటి ప్రవర్తన ఇద్దరికీ ఆమోదయోగ్యంగా ఉన్నంతవరకు ఎలాంటి ఇబ్బందీ ఉండదు. అలాగే దీనివల్ల మీ సోషల్‌ లైఫ్‌కు భంగం కలగకుండా ఉండడం కూడా ఎంతో అవసరం.ఒకవేళ ఈ ప్రవర్తన వల్ల మీకు ఇబ్బంది కలుగుతున్నట్లయితే మీ అభిప్రాయాన్ని అతనితోనే నేరుగా చెప్పే ప్రయత్నం చేయండి. ఈ క్రమంలో స్నేహపూర్వక వాతావరణంలో సమస్యను పరిష్కరించుకోండి. ఒకవేళ- ఇక్కడితో ఆగకుండా అతని ప్రవర్తన శ్రుతి మించి, విపరీత ధోరణులు కనిపిస్తుంటే మాత్రం అశ్రద్ధ చేయకుండా వెంటనే మానసిక వైద్య నిపుణులను సంప్రదించండి. వ్యక్తిగతంగా, మానసికంగా ప్రవర్తనాపరమైన లోపాలు ఉన్నాయేమో పరిశీలించి, తగిన చికిత్స చేసే అవకాశం ఉంటుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్