చన్నీటి స్నానం వల్ల కలిగే ప్రయోజనాలేమిటి?
'ఓ పక్క ఎముకలు కొరికే చలి.. మరో పక్క చన్నీటి స్నానం..' ఇది వింటేనే ఒళ్లు చలితో బిగుసుకుపోతుంది కదూ.. మరి స్నానం చేసేస్తే? అమ్మో! మేం అంత సాహసం చేయలేం అంటారా.. కానీ చలికాలంలో చాలామంది ఈ పద్ధతిని ఫాలో అవుతుంటారు.
'ఓ పక్క ఎముకలు కొరికే చలి.. మరో పక్క చన్నీటి స్నానం..' ఇది వింటేనే ఒళ్లు చలితో బిగుసుకుపోతుంది కదూ.. మరి స్నానం చేసేస్తే? అమ్మో! మేం అంత సాహసం చేయలేం అంటారా.. కానీ చలికాలంలో చాలామంది ఈ పద్ధతిని ఫాలో అవుతుంటారు. ముఖ్యంగా కార్తీక మాసంలో ఇలా చన్నీళ్లతో చేసే స్నానాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు కూడా.. కేవలం పవిత్రతే కాదు.. చన్నీటి స్నానం వల్ల ఆరోగ్యానికి కూడా ఎన్నో రకాలుగా మేలు జరుగుతుంది. అవేంటో చూద్దాం రండి..
పాపాలను కడిగే పవిత్ర స్నానం..
కార్తీక మాసం శివుడికి అత్యంత పవిత్రమైంది. కాబట్టి ప్రతిరోజూ శివలింగానికి ఈ పవిత్ర జలంతో ఎలాగైతే అభిషేకం చేస్తుంటారో.. అలాగే మన దేహాన్ని కూడా శివలింగంలాగా భావించి ఆ నీటితోనే స్నానం చేస్తుంటాం. దీనివల్ల గతంలో చేసుకున్న పాప కర్మలన్నీ సమసిపోతాయని భక్తులందరి విశ్వాసం. అలాగే కొంతమంది రోజుకు మూడుసార్లు కూడా చన్నీటి స్నానం చేస్తుంటారు. ఈ క్రమంలో శారీరకంగా, మానసికంగా మనలో ఉండే మలినాలను కడిగివేసే లక్షణం కేవలం నీటికే ఉంటుందన్నది కూడా చాలామంది అభిప్రాయం!
మెరుగయ్యే రక్త ప్రసరణ..
చన్నీటి స్నానం వల్ల శరీరంలోని అన్ని అవయవాలకు ఒక క్రమపద్ధతిలో రక్తప్రసరణ జరుగుతుంది. దీనివల్ల ఆరోగ్య పరంగా ఎలాంటి సమస్యలూ తలెత్తకుండా ఉంటాయి. అలాగే ధమనుల్లో కూడా రక్తప్రసరణ బాగా జరిగి గుండెను సురక్షితంగా ఉంచడంలో చల్లటి నీళ్లు తోడ్పడతాయి. ఈ స్నానం వల్ల బీపీ అదుపులో ఉండడంతో పాటు రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.. ఈ క్రమంలో శరీరంలోని మలినాలు, విషపదార్థాలు సులభంగా వేరై తొలగిపోతాయి.
శక్తినిస్తుంది..
చలికాలంలో ఉదయాన్నే చల్లటి నీళ్లు శరీరంపై పడగానే ఒళ్లు బిగుసుకుపోయినట్లుగా అనిపిస్తుంటుంది. దీంతో శ్వాసక్రియ రేటు కూడా పెరుగుతుంది. ఫలితంగా ఎక్కువ ఆక్సిజన్‌ను పీల్చుకుంటాం. అలాగే దీని వల్ల గుండె కొట్టుకునే వేగం పెరిగి శరీరంలోని అన్ని అవయవాలకు రక్తప్రసరణ వేగంగా జరుగుతుంది. ఈ క్రమంలో ఆ రోజంతటికీ కావలసిన శక్తి శరీరానికి లభిస్తుంది.
వ్యాయామం తర్వాత..
వ్యాయామం చేసే క్రమంలో కాసేపటి తర్వాత మన శరీరంలోని కండరాలు అలసిపోయి 'విశ్రాంతి తీసుకుంటే బాగుంటుంది..' అనే భావన మనలో కలుగుతుంది. అలాగే ఎక్కువసేపు చేయడం వల్ల కొన్ని సందర్భాల్లో కండరాలలో నొప్పిగా కూడా అనిపిస్తుంది. ఇలాంటప్పుడు కండరాల పైన చల్లటి నీళ్లు పోస్తే ఉపశమనం లభిస్తుంది.
మెరుగయ్యే జీవక్రియలు..
వాతావరణం చల్లగా అనిపిస్తే ఎలాగైతే మనం వెచ్చదనం కోసం స్వెట్టర్లు, శాలువాలు ధరిస్తామో.. అలాగే శరీరంపై చల్లటి నీళ్లు పడగానే శరీరంలోని కార్బోహైడ్రేట్లు, కొవ్వులు కరిగి వేడి పుడుతుంది. దీనివల్ల కేవలం బరువు తగ్గడం మాత్రమే కాదు.. శరీరంలోని జీవక్రియల పనితీరు కూడా మెరుగవుతుంది.
మానసిక ప్రశాంతతకు..
ఒత్తిడి, డిప్రెషన్‌తో బాధపడుతున్నారా?? అయితే ఒకసారి చన్నీళ్లతో స్నానం చేయండి. తేడా మీకే తెలుస్తుంది. దీనివల్ల ఒత్తిళ్లన్నీ మాయమై మానసిక ప్రశాంతత సొంతమవుతుంది. కాబట్టి ప్రతిరోజూ చన్నీళ్లతో స్నానం చేయడం వల్ల రోజంతా ప్రశాంతంగా ఉండచ్చు.
సో.. చన్నీటి స్నానం వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసుకున్నారు కదా! అయితే.. ఆరోగ్య పరంగా ఏవైనా సమస్యలు ఉన్నవాళ్లు; జలుబు, జ్వరం, సైనసైటిస్.. వంటి సమస్యలతో బాధపడే వాళ్లు మాత్రం చన్నీటి స్నానం చేయడం మంచిది కాకపోవచ్చు. ఇలాంటి సందర్భాల్లో వైద్య నిపుణులను సంప్రదించి వారి సూచనలు, సలహాలు పాటించడం మంచిది.
ఆ మాటకొస్తే- స్నానం విషయంలో- చన్నీళ్లు, వేణ్ణీళ్లు.. ఆరోగ్య పరంగా వేటి ప్రయోజనాలు వాటికున్నాయి. ప్రత్యేకించి వేడి నీటి వల్ల కలిగే ప్రయోజనాల గురించి మరో సందర్భంలో తెలుసుకుందాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- హెయిర్ బన్.. స్టైలిష్‌గా వేసేద్దాం!
- సన్‌స్క్రీన్... పౌడర్‌లో!
- వేసవిలో వీటి విషయంలో జాగ్రత్త!
- వ్యాయామం వల్ల మొటిమలు రాకుండా..!
- గడువు దాటితే వద్దు...
ఆరోగ్యమస్తు
- రాగుల్లో దాగున్న ‘ఆరోగ్యం’!
- వేరుశనక్కాయలు తింటే... ధ్యానం చేసినట్లే!
- తేలిగ్గా తీసుకోవద్దు!
- ప్రసవానంతరం పొట్టను ఇలా తగ్గించుకుందాం!
- వ్యాయామం చేయలేకపోతున్నారా?
అనుబంధం
- పోనీ ఇలా చెప్పి చూద్దామా?
- పెళ్లికి ముందు సరేనన్నాడు.. ఇప్పుడు వద్దంటున్నాడు!
- నో చెప్పండిలా!
- అనుమానిస్తున్నాడని నిరూపించేదెలా?
- పిల్లలకీ కావాలో రొటీన్!
యూత్ కార్నర్
- Miss Universe : ఈ ముద్దుగుమ్మదే.. ఆ ఘనత!
- ఆ చక్రాలని నడిపించేది వాళ్లే!
- దాచగలరు..!
- మన గచ్చకాయలాట... కొరియాలో!
- విరాళాలకు వారధిగా.. ఆమె సేవలు!
'స్వీట్' హోం
- వేసవిలో.. ఇల్లు చల్లగా!
- గోవర్ధనాల గుబాళింపు!
- ఇనుప కడాయిలో ఇవొద్దు!
- Green Vegetables : వీటిని ఎలా వండుతున్నారు?
- వాచీ రింగు పూల హంగు!
వర్క్ & లైఫ్
- ఒక్క రోజులోనే.. ఒంటరిగా.. ఆ ప్రాంతాలన్నీ చుట్టేశా!
- ఆ అల్లరి పిల్లే ఇప్పుడు టీచరైంది.. ఈ స్టూడెంట్-టీచర్ కథ చదివారా?!
- ప్రయాణాలకు... చిన్ని సాయాలు!
- ఆర్థికంగా ఎదగాలంటే...
- ఇది మహిళల హోలీ.. మగాళ్లకు నో ఎంట్రీ!