వీటితో.. బరువు అదుపులో..!
రాగులు, జొన్నలు, సజ్జలు, కొర్రలు.. మొదలైన చిరుధాన్యాలు ఆరోగ్యానికి మంచివన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఫిట్‌నెస్‌ని పెంపొందించడంలో సైతం ఇవి కీలక పాత్ర పోషిస్తాయంటున్నారు నిపుణులు. శరీర బరువుని అదుపులో పెట్టుకోవడానికి రోజూ చేసే వ్యాయామంతో పాటు....
రాగులు, జొన్నలు, సజ్జలు, కొర్రలు.. మొదలైన చిరుధాన్యాలు ఆరోగ్యానికి మంచివన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఫిట్‌నెస్‌ని పెంపొందించడంలో సైతం ఇవి కీలక పాత్ర పోషిస్తాయంటున్నారు నిపుణులు. శరీర బరువుని అదుపులో పెట్టుకోవడానికి రోజూ చేసే వ్యాయామంతో పాటు ఈ చిరుధాన్యాలను ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా కూడా మంచి ఫలితాలు రాబట్టవచ్చని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో చిరుధాన్యాలను ఆహారంగా తీసుకోవడం ద్వారా బరువు తగ్గించుకోవడంతో పాటు ఫిట్‌నెస్‌ని ఎలా కాపాడుకోవచ్చో తెలుసుకుందాం..
పోషకాలివే..
పేరుకు చిరుధాన్యాలే అయినా వీటిలో శరీరానికి అవసరమైన పోషకాలు విరివిగా లభిస్తాయి. పిండి పదార్థాలు, మాంసకృత్తులు, పీచు పదార్థం, ఖనిజ లవణాలు.. వంటివి పుష్కలంగా దొరుకుతాయి. వీటితో పాటు బి12, బి6.. విటమిన్లు కూడా ఎక్కువ శాతం ఉంటాయి. మాంసాహారంతో పోలిస్తే చిరుధాన్యాల్లో మాంసకృత్తులు అధికంగా లభిస్తాయి. అంతేకాదు.. వీటిలో ఎక్కువగా లభించే ఐరన్ కారణంగా రక్తహీనత దరిచేరదు. అలాగే పీచుపదార్థాలు మలబద్ధకం సమస్యను నివారించడంలో తోడ్పడతాయి.
క్యాలరీలు కరిగేందుకు..!
చిరుధాన్యాల్లో లభించే పీచుపదార్థం శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుంది. అంతేకాకుండా ఆహారం ద్వారా శరీరం పొందిన అధిక క్యాలరీలను ఖర్చయ్యేలా చేసి వూబకాయం సమస్య దరిచేరకుండా కాపాడుతుంది. చిరుధాన్యాల ద్వారా మనకు లభించే విటమిన్ 'బి'.. కార్బొహైడ్రేట్లు, కొవ్వు పదార్థాలను విచ్ఛిన్నం చేసి.. రక్తంలోని హోమోసిస్టీన్ స్థాయుల్ని అదుపులోకి తెస్తుంది. ఫలితంగా రక్తనాళాల్లో ఎక్కువ కొవ్వులు చేరవు. తద్వారా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.
ఎముకలు దృఢంగా..
ముప్ఫైల్లోకి అడుగుపెట్టిన తర్వాత కొంతమంది మహిళల్లో క్యాల్షియం లోపం కనిపిస్తుంది. ఫలితంగా ఎముకలు బలహీనంగా తయారవుతాయి. అలా జరగకుండా ఉండటానికి చాలామంది క్యాల్షియం సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉంటారు. అయితే వాటికి బదులుగా చిరుధాన్యాలను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా అంతే సమానమైన ఫలితాన్ని పొందచ్చంటున్నారు నిపుణులు. రాగుల్లో లభించే క్యాల్షియం, విటమిన్ 'డి'.. ఎముకలు బలంగా తయారయ్యేందుకు దోహదపడతాయి. కాబట్టి రోజూ చిరుధాన్యాలను ఆహారంగా తీసుకోవడం అటు ఆరోగ్యానికి, ఇటు ఎముకల్ని దృఢంగా తయారుచేసుకోవడానికి అవసరం.
బరువు తగ్గడానికి..
పప్పు ధాన్యాలతో పోలిస్తే చిరుధాన్యాల్లో పీచు పదార్థాలు, విటమిన్లు, ఫ్యాటీ ఆమ్లాలు, అమైనో ఆమ్లాలు.. వంటివన్నీ అధికంగా లభిస్తాయి. అంతేకాకుండా మాంగనీస్, ఫాస్ఫరస్, మెగ్నీషియం, కాపర్.. వంటి శరీరానికి అవసరమైన ఖనిజాలూ వీటిలో దొరుకుతాయి. ఇలా శరీరానికి అవసరమైన పోషకాలన్నీ లభించడం వల్ల ఎక్కువ సమయం ఆకలి వేయకుండా ఉంటుంది. అంతేకాకుండా ఈ చిరుధాన్యాలు జీవక్రియల పనితీరును కూడా మెరుగుపరుస్తాయి. దీంతో శరీరంలో పేరుకున్న కొవ్వు నిల్వలు సులభంగా కరిగిపోతాయి. ఫలితంగా శరీర బరువు అదుపులోకి వస్తుంది. అందుకే రోజూ ఏదో ఒక పూట వీటిని ఆహారంగా తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూనే ఫిట్‌గా ఉండచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- వేసవిలో ట్యాన్ సమస్య తగ్గాలంటే..!
- అడ్డిగ... అందాల నగ!
- ఇలా చేస్తే.. అందం తగ్గదు..!
- నాకు ఏ క్రీమ్?
- స్ట్రెచ్ మార్క్స్.. తగ్గట్లేదా..?
ఆరోగ్యమస్తు
- అందుకే వీటిని ఇలా తీసుకోవాలట..!
- వసంతంలో ఆరోగ్య జాగ్రత్తలు..!
- ప్రెగ్నెన్సీ.. ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా?
- ఉత్తేజంగా మారాలంటే..!
- రక్తహీనత తగ్గించే బీట్రూట్!
అనుబంధం
- ఒక మెట్టు దిగితే చాలు...
- ఆ అమ్మాయితో ఆ చాటింగ్.. ఆయన్ని నమ్మలేకపోతున్నా..!
- అలా చదివితే మేలే...
- చిన్నవే... చక్కదిద్దుతాయి!
- యుక్త వయసు నుంచీ...!
యూత్ కార్నర్
- అప్పుడు ఫ్యాన్... ఇప్పుడందరి ఫేవరెట్!
- భూగోళాన్ని చుట్టేస్తానంటోంది!
- దాంతో మాట్లాడుతుంటే మతి పోయిందనేవాళ్లు!
- ఎరీ... ఆ ఊరి పట్టు..!
- అందరికీ నచ్చేవి.. నాకు నచ్చవు.. ఎందుకిలా?
'స్వీట్' హోం
- పుల్లటి పెరుగుతో.. పెరిగే రుచి!
- రిస్క్ లేకుండా దాచేద్దాం!
- వేసవిలో ఇల్లు చల్లగా...
- కళ్లు తిరిగే కార్పెట్లు...
- ఆ చోటు గుర్తిస్తే చాలు...
వర్క్ & లైఫ్
- మీకు ‘ట్రావెలింగ్’ అంటే ఇష్టమా..?
- పనికి ‘బ్రేక్’ వేయండి!
- ఇవి టైంపాస్ కోసమే కాదు.. సంపాదనకూ..!
- మారాలని గట్టిగా అనుకోండి!
- Samantha: చిన్న చిట్కాలతోనే 45 కిలోల బరువు తగ్గా..!