పోషకాల గని.. అందుకే సమ్మర్లో ఈ పండు తినాల్సిందే!

సీజన్‌ను బట్టి మన జీవన శైలిలోనూ కొన్ని మార్పులు చేసుకోవాలి. ప్రత్యేకించి వేసవి కాలంలో శరీరానికి చలువనిచ్చే పండ్లను, కూరగాయలను ఆహారంలో తప్పకుండా భాగం చేసుకోవాల్సిందే. కాలానుగుణంగా లభించే పండ్లను అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో నీటి స్థాయులు పెరగడమే కాకుండా....

Updated : 03 Apr 2023 20:13 IST

సీజన్‌ను బట్టి మన జీవన శైలిలోనూ కొన్ని మార్పులు చేసుకోవాలి. ప్రత్యేకించి వేసవి కాలంలో శరీరానికి చలువనిచ్చే పండ్లను, కూరగాయలను ఆహారంలో తప్పకుండా భాగం చేసుకోవాల్సిందే. కాలానుగుణంగా లభించే పండ్లను అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో నీటి స్థాయులు పెరగడమే కాకుండా కాలక్రమేణా రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఇక ఎండ వేడిమి నుంచి శరీరానికి తక్షణ శక్తినందించే పండ్లు ఎన్నో ఉన్నప్పటికీ తర్బూజా (Muskmelon) ప్రత్యేకత వేరు.

పోషకాలు పుష్కలం!

ఈ పండులోని వివిధ పోషకాలు శరీరంలో నీటి స్థాయులను పెంచి డీహైడ్రేట్‌ కాకుండా కాపాడతాయి.

ఫైబర్‌ మలబద్ధకం, మూత్ర సంబంధ సమస్యలు, అలసట, రక్తపోటు సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

ఫోలిక్ యాసిడ్‌ యాంటీ కోయాగ్యులెంట్ ఫ్యాక్టర్‌గా పనిచేసి రక్తనాళాల్లో గడ్డకట్టిన రక్తాన్ని కరిగించడంలో సహాయపడుతుంది. కండరాల నొప్పులు కూడా తగ్గిపోతాయి.

తర్బూజాలో విటమిన్‌-ఎ కూడా అధికంగా ఉంటుంది. ఇది కంటి సమస్యలను దూరం చేయడమే కాకుండా కంటి చూపు సామర్థ్యాన్ని పెంచుతుంది.

క్యాలరీలు తక్కువగా ఉన్న ఈ పండును ఆహారంలో భాగం చేసుకుంటే చర్మ సంబంధ సమస్యలు దూరమవడంతో పాటు అధిక బరువు కూడా నియంత్రణలోకి వస్తుంది.

ఇన్ని ప్రయోజనాలున్నందుకే సమ్మర్‌లో ఈ పండును కచ్చితంగా డైట్‌లో చేర్చుకోవాలంటున్నారు నిపుణులు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని