ఈ నూనెతో ఆ సమస్యలు దూరం!

వివిధ రకాల క్యాన్సర్ల నుంచి రక్షణ కల్పించడమే కాకుండా.. చర్మ, గర్భాశయ సంబంధిత సమస్యల నుంచి కాపాడే గుణాలు ఆలివ్ నూనెలో ఉన్నాయని, అందుకే దీనిని ఆహారంలో....

Published : 05 Oct 2022 11:26 IST

వివిధ రకాల క్యాన్సర్ల నుంచి రక్షణ కల్పించడమే కాకుండా.. చర్మ, గర్భాశయ సంబంధిత సమస్యల నుంచి కాపాడే గుణాలు ఆలివ్ నూనెలో ఉన్నాయని, అందుకే దీనిని ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

చెడు కొలెస్ట్రాల్..

ఆలివ్‌ నూనెను ఆహారంలో భాగం చేసుకునే వారి శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ శాతం క్రమంగా తగ్గినట్లు ఎన్నో పరిశోధనల్లో రుజువైంది. దీనికి కారణం అందులో ఉండే పాలీఫినాల్ అనే ఔషధం. ఇది రక్తనాళాలు, గుండె కవాటాల్లో చేరుకునే చెడు కొలెస్ట్రాల్‌ను ఎప్పటికప్పుడు తొలగిస్తుంది. ఫలితంగా గుండెపోటు, బరువు పెరగడం.. వంటి అనారోగ్యాలు దరిచేరకుండా జాగ్రత్తపడచ్చు.

జ్ఞాపకశక్తి

జ్ఞాపకశక్తిని కోల్పోవడం, మెదడు కణాలు దెబ్బతినడం.. వంటి సమస్యలకు ఇది సరైన ఔషధం. ఆలివ్‌ నూనె వాడకం మెదడుకు రక్త ప్రసరణ సాఫీగా జరిగేలా చేస్తుంది. నరాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అల్జీమర్స్‌ సమస్యతో బాధపడే వారు ఆలివ్‌ నూనెను ఆహారంలో భాగం చేసుకుంటే ఫలితం ఉంటుంది.

గర్భాశయ క్యాన్సర్

మహిళల్లో ఎక్కువగా వచ్చే క్యాన్సర్లలో గర్భాశయ క్యాన్సర్‌ కూడా ఒకటి. మరి, ఈ వ్యాధి రాకుండా జాగ్రత్తపడాలన్నా, దీనికి ఆరంభంలోనే చెక్‌ పెట్టాలన్నా ఆలివ్‌ నూనె వాడకం మంచి మార్గం. ఆలివ్‌ నూనెను ఆహారంలో భాగం చేసుకోని వారితో పోలిస్తే చేసుకున్న వారిలో గర్భాశయ క్యాన్సర్‌ లక్షణాలు తక్కువని పరిశోధకులు నిర్ధరించారు.

పేగు క్యాన్సర్

ఆలివ్‌ నూనె పేగు క్యాన్సర్‌ను నివారించడంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది. పేగు కణాల్లో పేరుకుపోయే అధిక కొవ్వును నియంత్రించే గుణం ఈ నూనెకు ఉంది. అలాగే వాటి మధ్య కణతులు ఏర్పడకుండా అడ్డుకుని, క్యాన్సర్‌ని కలిగించే కణాలను నాశనం చేసే సామర్థ్యం కూడా ఉంది. అంతేకాదు.. అల్సర్‌ తీవ్రతను తగ్గించి, ఉపశమనాన్ని అందించే ఉత్తమ ఔషధంగానూ ఈ నూనె పని చేస్తుంది.

చర్మ సమస్యలు..

కొందరి చర్మం పొడిబారిపోయి దురద పెడుతూ ఉంటుంది. సమస్య తీవ్రరూపం దాల్చితే, పొట్టు రూపంలో ఊడిపోతుంది కూడా. ఇలాంటి వారు స్నానానికి 15 నిమిషాల ముందు ఆలివ్‌ ఆయిల్‌తో మర్దన చేసుకుంటే త్వరగా ఉపశమనం పొందచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని