పెళ్లి ఘడియలు దగ్గర పడితే..
తనదైన రోజున మెరవాలని ఏ వధువు మాత్రం కోరుకోదు? దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. వాటిలో పొరపాట్లు జరగట్లేదు కదా!
తనదైన రోజున మెరవాలని ఏ వధువు మాత్రం కోరుకోదు? దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. వాటిలో పొరపాట్లు జరగట్లేదు కదా!
* పెళ్లి దగ్గర పడుతోందన్న భయమో.. నాజూగ్గా కనిపించాలన్న తాపత్రయమో.. చాలామంది తిండిని పక్కన పడేస్తారు. పూర్తిగా జ్యూస్‌లమీదే ఆధారపడేవారూ ఎక్కువే! మీరూ అదే కోవా? అయితే పొరపాటు చేస్తున్నట్లే. నీరసించిన ముఖంలో జీవం సాధ్యమవదు కదా! పైగా శక్తి తగ్గి చిన్నవాటికే విసుగు, చిరాకూ వంటివీ కలుగుతాయి. కాబట్టి, కొద్దికొద్దిగా అయినా పర్లేదు కానీ.. తినడం మాత్రం మానొద్దు.
* సోషల్‌మీడియా వచ్చాక నిపుణుల సాయం కోరే వారి సంఖ్య తగ్గుతోంది. సామాజిక మాధ్యమాల్లో సలహాలు ఇచ్చే వారందరూ నిపుణులే అవ్వాలనేం లేదు. ‘వారంలో కొవ్వు మాయం’, ‘రెండు రోజుల్లో మెరిసిపోండి’ అని కొత్తవి ప్రయత్నించారో.. అసలుకే ముప్పు రావొచ్చు. సహజ చిట్కాలైనా సరే ప్యాచ్ టెస్ట్ చేశాకే వాడాలి.
* అసలే వేసవి. కొత్త ఆహారాల్ని ప్రయత్నించొద్దు. అలర్జీల అవకాశమే కాదు.. పొట్టా చెడగలదు. తేలిగ్గా అరిగే ఆహారం, ద్రవపదార్థాలు, పండ్లను ఎక్కువగా తీసుకోండి. డైట్ పేరుతో కార్బోహైడ్రేట్లు, కొవ్వులనీ పక్కన పడేయొద్దు. అన్నీ తగిన మోతాదులో తీసుకుంటేనే ఆరోగ్యం.
* ఆరోజు మెరిసిపోవాలని కెమికల్ పీల్స్, వ్యాక్స్ వంటివి అస్సలు ప్రయత్నించొద్దు. పడలేదో.. చర్మమంతా పాడవుతుంది. మెరిపించాలని తరచూ స్క్రబింగ్ చేస్తే ముఖం నిర్జీవంగా తయారవుతుంది. పాతవాటినే కొనసాగించండి. షాపింగ్‌లంటూ అతిగా తిరగడం, అనవసరంగా కంగారు పడటం మాని ఎక్కువ విశ్రాంతి తీసుకోండి.. సహజంగా అందంగా కనిపిస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.