గర్భం ధరించాకా.. పనిలోకి!
ఈరోజుల్లో గర్భం ధరించినా.. నెలలు నిండేదాకా కెరీర్‌లో కొనసాగే మహిళలే ఎక్కువ! అలాగని ఈ సమయంలో అందరి ఆరోగ్యం వృత్తిజీవితానికి సహకరిస్తుందని చెప్పలేం. కానీ ప్రెగ్నెన్సీలో ఎలాంటి సమస్యలు లేకపోతే డాక్టర్ సలహా మేరకు కెరీర్‌ని కొనసాగించడమే మేలంటున్నారు నిపుణులు.
ఈరోజుల్లో గర్భం ధరించినా.. నెలలు నిండేదాకా కెరీర్‌లో కొనసాగే మహిళలే ఎక్కువ! అలాగని ఈ సమయంలో అందరి ఆరోగ్యం వృత్తిజీవితానికి సహకరిస్తుందని చెప్పలేం. కానీ ప్రెగ్నెన్సీలో ఎలాంటి సమస్యలు లేకపోతే డాక్టర్ సలహా మేరకు కెరీర్‌ని కొనసాగించడమే మేలంటున్నారు నిపుణులు. తద్వారా ఇటు తల్లికి, అటు పుట్టబోయే బిడ్డకు పలు ప్రయోజనాలు చేకూరతాయంటున్నారు.
తల్లీబిడ్డలకు మంచిది!
⚛ తొమ్మిది నెలల పాటు ఇటు ఇంటి పనులు, అటు ఆఫీస్ పనులు చురుగ్గా చేసుకోవడం వల్ల సుఖ ప్రసవం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట!
⚛ ఇలా మనం ఎప్పుడూ పనిలో బిజీగా ఉండడం వల్ల లేనిపోని ఆలోచనలు మనసులోకి రాకుండా, ఒత్తిడి దరిచేరకుండా మానసిక ప్రశాంతత దొరుకుతుంది.
⚛ కొంతమంది పనిలోనే ఆనందాన్ని వెతుక్కుంటారు. ఇలాంటి వారు ప్రెగ్నెన్సీ అంతా హ్యాపీగా ఉంటే.. పుట్టబోయే బిడ్డ కూడా హ్యాపీగా, యాక్టివ్‌గా పుట్టే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.
ఈ జాగ్రత్తలు ముఖ్యం!
అలాగే ఈ సమయంలో కాబోయే తల్లులు పలు జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యమంటున్నారు నిపుణులు.
⚛ గర్భిణిగా ఉన్నప్పుడు కూడా కొంతమంది వ్యాయామాలు చేస్తుంటారు. అయితే ఈ క్రమంలో సొంత నిర్ణయాలు కాకుండా నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. అలాగే ఆఫీస్ పనిలో ఉన్నా.. నెమ్మదిగా శరీరాన్ని కదిలిస్తూ చేసే కుర్చీ వ్యాయామాలకు గర్భిణులు ప్రాధాన్యమివ్వచ్చు.
⚛ నెలలు నిండుతున్న కొద్దీ పెరుగుతున్న పొట్ట వల్ల అసౌకర్యం కలగచ్చు. ఈ క్రమంలో పొట్ట సపోర్ట్ కోసం గైనకాలజిస్ట్ సలహా మేరకు బెల్లీ బ్యాండ్ వాడాలి.
⚛ గర్భిణిగా ఉన్నప్పుడు ఇంట్లోనే కాదు.. బయటికి వెళ్లినా సౌకర్యవంతంగా ఉండే దుస్తుల్ని ధరించడానికే మొగ్గు చూపాలి. ఈక్రమంలో వదులుగా ఉండే కాటన్ దుస్తులు వేసుకుంటే కంఫర్టబుల్‌గా ఉంటుంది.. అలాగే హీల్స్‌కు బదులుగా ఫ్లాట్‌గా ఫ్లాట్స్ ప్రాధాన్యమివ్వడం, ప్రెగ్నెన్సీ ఫుట్‌వేర్ ఎంచుకోవడం మంచిది.
⚛ ఖాళీ సమయాల్లో మీకు నచ్చిన పనులు చేయడం, మ్యూజిక్ వినడం.. వంటివి చేస్తే మనసుకు, శరీరానికి రిలాక్స్‌డ్‌గా ఉంటుంది. అలాగే సరిపడా నిద్ర పోవడం కూడా ముఖ్యమే!
⚛ ఇక పని బిజీలో పడిపోయి ఆహారాన్ని నిర్లక్ష్యం చేయకుండా.. వేళకు భోజనం చేయడం, తక్కువ ఆహారం ఎక్కువ సార్లు తినడం మంచిది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.