నాన్‌స్టిక్ పాత్రల్ని ఇలా వాడితే ఎక్కువ కాలం మన్నుతాయి!
మహిళలు వంటింట్లో ఎక్కువ కష్టపడకుండా.. సులభంగా వంట పని పూర్తిచేసుకోవడంతో పాటు శుభ్రపరుచుకునేందుకు కూడా వీలుగా ఉండే పాత్రలు నాన్‌స్టిక్ కుక్వేర్. అందుకే వంటింటి మహారాణులంతా నాన్‌స్టిక్ కుక్వేర్ని ఎంతగానో ఆదరిస్తున్నారు. అయితే ఈ రోజుల్లో ఆరోగ్య రీత్యా మట్టి పాత్రల వాడకం క్రమంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ నూనె ఉపయోగం తగ్గుతుందని, వేపుళ్లు రుచికరంగా ఉంటాయని..
మహిళలు వంటింట్లో ఎక్కువ కష్టపడకుండా.. సులభంగా వంట పని పూర్తిచేసుకోవడంతో పాటు శుభ్రపరుచుకునేందుకు కూడా వీలుగా ఉండే పాత్రలు నాన్‌స్టిక్ కుక్వేర్. అందుకే వంటింటి మహారాణులంతా నాన్‌స్టిక్ కుక్వేర్ని ఎంతగానో ఆదరిస్తున్నారు. అయితే ఈ రోజుల్లో ఆరోగ్య రీత్యా మట్టి పాత్రల వాడకం క్రమంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ నూనె ఉపయోగం తగ్గుతుందని, వేపుళ్లు రుచికరంగా ఉంటాయని.. ఇలా వివిధ కారణాలతో అనునిత్యం ఏదో ఒక విధంగా నాన్‌స్టిక్ పాత్రల్ని వాడుతున్నారు గృహిణులు. అయితే వీటిని మామూలు పాత్రల్లా ఇష్టం వచ్చినట్లు వాడితే వాటికి ఉన్న టెఫ్లాన్ కోటింగ్ త్వరగా పోయి, పనికి రాకుండా పోతాయి. నాన్‌స్టిక్ పాత్రల్లో ఉండే టెఫ్లాన్ కోటింగ్ స్టౌ నుంచి వచ్చే వేడిని తగ్గించి, కూరలు చక్కగా ఉడకడానికి అవసరమైన మేరకు వేడిని అందిస్తుంది.. ఫలితంగా కూర మాడిపోకుండా ఉంటుంది. అంతేకాదు.. ఈ నాన్‌స్టిక్ కుక్వేర్ వాడకం విషయంలో మరిన్ని జాగ్రత్తలు పాటిస్తే అవి ఎక్కువ కాలం మన్నుతాయి. ఇంతకీ అవేంటో తెలుసుకొని మనమూ పాటించేద్దామా..!!
* నాన్‌స్టిక్ పాత్రలు కొన్నాక మొదటిసారి ఉపయోగించేటప్పుడు వాటికి ఉన్న స్టిక్కర్స్ తొలగించాలి. నేరుగా చేత్తో లాగితే మొత్తం ఊడిరాకుండా పాత్రకు కొంత అతుక్కుపోయే అవకాశం ఉంది. అందుకే ఆ పాత్రను స్టౌ మీద పెట్టి కాస్త వేడి చేస్తే ఆ స్టిక్కర్ సులభంగా వూడి వచ్చేస్తుంది.
* ఆ తర్వాత కొద్దిగా వేడిచేసిన నీటితో పాత్రలను శుభ్రం చేసి ఆరబెట్టాలి.
* స్టౌ మీద నాన్‌స్టిక్ పాత్రలు ఉపయోగించేప్పుడు వాటిని సన్నని సెగపైనే (మంటపైనే) ఉంచాలి. లేదంటే ఎక్కువ వేడి వల్ల వాటికి ఉన్న టెఫ్లాన్ కోటింగ్ పోతుంది.
* అవసరమైనంత మేరకే నాన్‌స్టిక్ పాత్రలను ఉపయోగించుకోవాలి. ఏ వంటకాలైతే వండేటప్పుడు అంటుకునే స్వభావం కలిగి ఉంటాయో వాటిని వండటానికి మాత్రమే నాన్‌స్టిక్ పాత్రలను ఉపయోగించాలి. వేణ్నీళ్లు మరిగించడానికి... ఇతరత్రా అనవసరమైన పనులకు వీటిని ఉపయోగించడం వల్ల నాన్‌స్టిక్ పాత్రలు త్వరగా పాడైపోతాయి.
* నాన్‌స్టిక్ పాత్రలను ఉపయోగించి వంట చేసేటప్పుడు స్టౌ మంట సిమ్‌లో లేదంటే మీడియంలో ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా వంట ప్రారంభంలో.. మామూలు పాత్రల్లో వంట చేసే క్రమంలో వాటిని ముందు స్టౌ మీద పెట్టి వేడి చేసి అప్పుడు నూనె వేసి వంట ప్రారంభిస్తారు. కానీ, ఈ పాత్రలను నేరుగా పెద్ద మంట మీద అలా ఖాళీగా ఉంచకూడదు. వీటిని స్టౌ మీద పెట్టిన వెంటనే అందులో నూనె వేయడం మర్చిపోవద్దు.
* ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే.. పెద్ద మంట మీద వంట చేస్తే తొందరగా పూర్తవుతుంది.. రుచిగా కూడా ఉంటుందని చాలామంది అనుకుంటారు. కానీ అది నిజం కాదు.. ఎంత చిన్న మంట మీద వంట చేస్తే.. అంత రుచిగా ఉంటుంది. సమయం కాస్త ఎక్కువే పట్టినా.. ఆ కాయగూరలు నెమ్మదిగా ఉడికి దాని రుచి మరింతగా పెరిగిపోతుంది. నాన్‌స్టిక్ పాత్రలను కూడా ఇదే ఉద్దేశంతోనే తయారు చేశారు. అందుకే ఎంత తక్కువ మంట మీద వాటిని ఉపయోగిస్తే.. అవి అంత ఎక్కువ కాలం మన్నుతాయి.
* వీటిలో కూరలు వండేటప్పుడు మధ్యమధ్యలో కలపడానికి స్టీల్, ఇనుము, ఇత్తడి కాకుండా చెక్కతో చేసిన గరిటెలను ఎంచుకోవడం ఉత్తమం. ఫలితంగా పాత్రలపై గీతలు పడకుండా ఎక్కువ కాలం మన్నుతాయి.
* ఈ పాత్రలను శుభ్రం చేయడానికి అధిక గాఢత గల సబ్బులు, గరుకుగా ఉండే పీచులు ఉపయోగించకూడదు. మెత్తటి పీచు లేదా బ్రష్ ఉపయోగించి వేడినీళ్లతో శుభ్రం చేయవచ్చు. ఇక ‘క్లీనింగ్ పౌడర్ వాడక తప్పదు’ అనుకుంటే లిక్విడ్ సోప్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి.
* ఒకవేళ పాత్రకు ఏవైనా పదార్థాలు గట్టిగా అతుక్కొని అలాగే ఉండిపోతే వాటిని తొలగించడానికి చాకు లేదా ఇతర పదునైన వస్తువులు ఉపయోగించకూడదు. పాత్రలో నీళ్లు పోసి కొద్దిసేపు నానబెట్టాలి. తర్వాత నెమ్మదిగా రుద్ది కడిగితే అవి సులభంగా తొలగిపోతాయి.
* నాన్‌స్టిక్ పాత్రలను కిచెన్ ప్లాట్‌ఫామ్ పైన, అల్మరాల్లోనూ కాకుండా సామాన్లు భద్రపరిచే స్టాండ్‌లోనే పెడితే వాటి పైభాగంలో ఉండే పెయింట్ కోటింగ్ పోకుండా ఎక్కువ కాలం ఉంటుంది.
* ఈ పాత్రలను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ, మెత్తని పొడి వస్త్రంతో తుడిచి భద్రపరిస్తే ఎక్కువ కాలం పాటు కొత్తవిగానే కనిపిస్తాయి.
* నాన్‌స్టిక్ పాత్రలు కొన్నప్పుడు వాటితో పాటు చిన్న సూచనల పుస్తకం ఒకటి ఇస్తారు. అందులో మరిన్ని జాగ్రత్తలు, వీటిని వాడే విధానం గురించి ఉంటుంది. కాబట్టి నాన్‌స్టిక్ వంటపాత్రల్ని వాడే ముందు ఆ సూచనల్ని చదివితే వీటి వాడకానికి సంబంధించిన మరింత సమాచారం మీకు తెలుస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- స్పోర్ట్స్ బ్రా.. ఎలా ఎంచుకోవాలి?
- చీరపై... రామ చిత్రాలెన్నో!
- వేసవిలో అందానికి.. ఈ మూడూ!
- Summer Tips: స్నానంతో అలసట దూరం!
- బుట్ట బొమ్మకు... బియ్యపు ముత్యాలు!
ఆరోగ్యమస్తు
- ఆరోగ్యాన్నిచ్చే.. నవమి నైవేద్యం!
- ఆరోగ్యానికి... శ్రీరామరక్ష!
- ఈ సమస్యలకు విరుగుడు.. కొబ్బరి నీళ్లు!
- ఇలా చేస్తే ఎనామిల్ పోతుందా?
- కర్రతో చేద్దామా కసరత్తు!
అనుబంధం
- సీత... ఎప్పటికీ వాళ్ల పెద్ద కూతురే!
- విడాకుల విషయం పిల్లలకెలా చెప్పాలి?
- ఈ విషయాల్లో.. పెళ్లికి ముందే స్పష్టత అవసరం!
- బాబు పుట్టాక దూరం పెడుతున్నాడు!
- మీకు టీనేజీ పిల్లలున్నారా?
యూత్ కార్నర్
- UPSC Results : సంకల్ప బలంతో సాధించారు!
- అమ్మాయిలు...అదరగొట్టేశారు!
- ఈ కవలలు... స్ఫూర్తి శిఖరాలు!
- Anshita Mehrotra : కర్లీ హెయిర్‌ను కాపాడుతోంది!
- ఆటకు దూరమైనా... అభిమానులు పెరిగారు!
'స్వీట్' హోం
- మామిడి పండు ఇడ్లీలు!
- ఎంబ్రాయిడరీతో రామకథ!
- వార్డ్రోబ్.. సువాసనభరితంగా!
- శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా!
- విరిగిన పాలతో ఇలా!
వర్క్ & లైఫ్
- ఇంటికో సీతమ్మ తల్లి!
- ముందున్నాం..!
- మహిళలే టీచర్లయితే...
- మరో పెళ్లి చేసుకున్నాక... కాపురం చేస్తానంటున్నాడు!
- ఆకట్టుకుందామిలా..