ఆ ‘ఫైరే’ ఆస్కార్ బరిలో నిలిపింది!
ఇప్పుడంటే అమ్మాయిలు పురుషాధిపత్యం ఉన్న రంగాల్లోనూ పాగా వేస్తున్నారు.. కానీ ఇరవై ఏళ్లు వెనక్కి వెళ్తే.. నాటి పరిస్థితులు ఇందుకు పూర్తి భిన్నం. ఆ సమయంలో కొన్ని రంగాలైతే అబ్బాయిలకే పరిమితం అన్నట్లుగా ఉండేవి. పాత్రికేయ రంగమూ ఇందుకు మినహాయింపు కాదు.
ఇప్పుడంటే అమ్మాయిలు పురుషాధిపత్యం ఉన్న రంగాల్లోనూ పాగా వేస్తున్నారు.. కానీ ఇరవై ఏళ్లు వెనక్కి వెళ్తే.. నాటి పరిస్థితులు ఇందుకు పూర్తి భిన్నం. ఆ సమయంలో కొన్ని రంగాలైతే అబ్బాయిలకే పరిమితం అన్నట్లుగా ఉండేవి. పాత్రికేయ రంగమూ ఇందుకు మినహాయింపు కాదు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే మహిళల కోసం మహిళలు పుట్టించిందే ‘ఖబర్ లహరియా’ అనే వార్తా సంస్థ. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలే దీనికి ఫీడ్. అక్కడి దళిత మహిళలే ఈ వార్తల్ని సేకరించే వారధులు. ఈ క్రమంలోనే ఇంటా, బయటా ఉన్న మూసధోరణుల్ని బద్దలు కొట్టి సంస్థకు పట్టుగొమ్మగా మారిన వారి ధైర్యం, పట్టుదల, నిజాయతీ.. వంటివి యువ దర్శకులు సుస్మిత్ ఘోష్, రింటూ థామస్‌లను ఆకట్టుకున్నాయి. ఇదే కథాంశంగా ‘రైటింగ్ విత్ ఫైర్’ పేరుతో సినిమాను తెరకెక్కించేలా ప్రేరేపించాయి. గంటన్నర నిడివి గల ఈ డాక్యుమెంటరీ ఎన్నో అంతర్జాతీయ అవార్డులు అందుకోవడమే కాదు.. తాజాగా ఆస్కార్ బరిలో నిలిచి భారతీయ సినిమా ఖ్యాతిని మరోసారి ప్రపంచవ్యాప్తం చేసింది.
చలన చిత్ర రంగంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ఆస్కార్/అకాడమీ అవార్డు కోసం పోటీ పడడమంటే మాటలు కాదు. విభిన్న కథాంశంతో పాటు భాషా భేదం లేకుండా అంతర్జాతీయంగా ఉన్న సినీ ప్రేక్షకుల్ని ఆకట్టుకోవాలి. ఇన్ని లక్షణాలతో పాటు విమర్శకుల ప్రశంసలందుకుంది కాబట్టే ప్రేక్షకాదరణ పొందిన సినిమాల్ని వెనక్కి నెట్టి మరీ ‘రైటింగ్ విత్ ఫైర్’ ఆస్కార్ బరిలో నిలిచింది.
ఇంతకీ ఏంటీ సినిమా కథ?
దేశంలోనే దళిత మహిళలు నడుపుతోన్న తొలి వార్తా సంస్థ ‘ఖబర్ లహరియా’ కథ ఆధారంగా రూపొందించిందే ‘రైటింగ్ విత్ ఫైర్’ అనే 94 నిమిషాల డాక్యుమెంటరీ. పురుషాధిపత్యం ఉన్న వార్తా ప్రపంచంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ దళిత మహిళలు ఈ సంస్థను తీర్చిదిద్దిన తీరును కళ్లకు కట్టినట్లు చూపించారు దర్శకులు సుస్మిత్ ఘోష్, రింటూ థామస్. స్మార్ట్ఫోన్లనే ఆయుధాలుగా చేసుకొని, కుల వివక్షను, లింగ వివక్షను ఎదుర్కొంటూ.. దేశంలోని సమస్యాత్మక ప్రాంతాల నుంచి వాళ్లు వార్తలు సేకరించడం, నిజాల్ని నిగ్గు తేల్చే ఎన్నో విషయాల్ని ప్రచురించి పాఠకులకు అందించడం.. వంటి సన్నివేశాలన్నీ ప్రేక్షకుల మనసుల్ని హత్తుకుంటాయి. ఎంతోమంది అత్యాచార, గృహహింస బాధితుల నుంచీ ఎన్నో విస్తుపోయే వాస్తవాల్ని సైతం ఈ చిత్రంలో మనం చూడచ్చు. ఇలా మహిళా శక్తిని ప్రతిబింబించేలా రూపుదిద్దుకున్న ఈ సినిమా ఇప్పుడు ఆస్కార్‌కు నామినేట్ అయి భారతీయ సినిమా హవాను చాటింది.
నాయకులే నాయికలై..!
2002లో దిల్లీకి చెందిన నిరంతర్ ట్రస్ట్ అనే స్వచ్ఛంద సంస్థ ‘ఖబర్ లహరియా’ను ప్రారంభించింది. ఉత్తరప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్‌కు చెందిన కవితా దేవి దీనికి సహవ్యవస్థాపకురాలు. తొలుత ఆరుగురు దళిత మహిళలు స్థానిక వార్తలు సేకరించి బుందేలీ, హిందీ భాషల్లో వాటిని ప్రజలకు అందించేవారు. ఆ మరుసటి ఏడాదే మీరా దేవి ఈ సంస్థలో రిపోర్టర్‌గా చేరారు. 18 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న ఆమె ప్రస్తుతం మేనేజింగ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీరాతో పాటు క్రైమ్ రిపోర్టర్ సునీత ప్రజాపతి, మరో రిపోర్టర్ శ్యామ్‌కాళీ దేవి.. ఈ ముగ్గురు ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటించారు. 94 నిమిషాల నిడివి గల ఈ డాక్యుమెంటరీ ఈ ముగ్గురు రిపోర్టర్ల చుట్టూ తిరుగుతూ.. పురుషాధిపత్యం ఉన్న రంగంలో పలు సమస్యల్ని ఎదుర్కొని వాళ్లు నిలదొక్కుకున్న విధానాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపుతుంది. 2016 నుంచి ఈ సంస్థ డిజిటల్ మాధ్యమాల వేదికగా వార్తల్ని అందిస్తోంది. ఈ క్రమంలో వార్తల్ని వీడియోల రూపంలో రూపొందించి తమ వెబ్సైట్, యూట్యూబ్ ఛానల్లో ప్రసారం చేస్తోంది. ప్రస్తుతం ఈ సంస్థ వార్తలు పది మిలియన్లకు పైగా మందికి చేరువవుతున్నాయి.
తనే అమ్మానాన్నల్ని ఒప్పించింది!
ఇప్పుడంటే పరిస్థితుల్లో కాస్తో కూస్తో మార్పు కనిపిస్తోంది.. కానీ ఇరవై ఏళ్లకు పూర్వం గ్రామాల్లో ఉండే అమ్మాయిలపై ఎన్ని ఆంక్షలు ఉండేవో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. తాను ఉద్యోగంలో చేరిన తొలినాళ్లలో ఇలాంటి సమస్యల్నే ఎదుర్కొన్నానంటోంది ‘రైటింగ్ విత్ ఫైర్’ నాయిక, ‘ఖబర్ లహరియా’ మేనేజింగ్ ఎడిటర్ మీరా దేవి. ‘రోజులు మారాయి. ఇప్పుడంటే నేను మీతో ఇంత ఫ్రీగా, ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాను.. కానీ నేను ఉద్యోగంలో చేరిన తొలినాళ్లలో నా మనసులో ఏ మూలో కాస్త బెరుకు ఉండేది. ‘రాత్రింబవళ్లు తేడా లేకుండా బయటికి వెళ్లాలి.. అదీ ఎవరి తోడూ లేకుండా..! ఇలా వెళ్లారన్న విషయం ఇరుగుపొరుగు వాళ్లకు తెలిస్తే ఏం సమాధానం చెప్తారు?’ అంటూ అమ్మానాన్న నన్ను నిలదీశారు. నిజానికి ఆ సమయంలో నా నోట మాట రాలేదు. కానీ నా సహ రిపోర్టర్ కవిత మా అమ్మానాన్నలతో మాట్లాడి వారిని ఒప్పించింది..’ అంటూ నాటి పరిస్థితుల్ని తన స్వీయానుభవాలతో వివరించిందీ మహిళా రిపోర్టర్. తన 18 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో అంచెలంచెలుగా ఎదిగిన ఆమె.. పరిశోధనాత్మక జర్నలిజం, పాలసీ రిపోర్టింగ్‌లో ప్రావీణ్యురాలు. అంతేకాదు.. ప్రస్తుతం ఆమె స్థానిక రాజకీయాలపై ‘Rajneeti, Ras, Raay’ అనే షో కూడా నిర్వహిస్తోంది.
మాటలకు మించిన సంతోషమిది!
ప్రజాదరణ పొందిన ఎన్నో చిత్రాలను వెనక్కి నెట్టి తమ చిత్రం ఆస్కార్‌కు నామినేట్ అవడం గర్వించదగ్గ విషయం అంటున్నారు దర్శకురాలు రింటూ థామస్. ‘నోట మాట రావట్లేదు.. మాటలకు మించిన ఆనందమిది. దళిత మహిళల విజయానికి నిదర్శనంగా నిలిచిన ఈ కథనానికి దర్శకత్వం వహించడం గర్వంగా అనిపిస్తోంది. భారతీయ సినీ పరిశ్రమకు ఇది గొప్ప క్షణం. ఇది స్త్రీల విజయం.. మన విజయం..!’ అంటూ ఉబ్బితబ్బిబ్బవుతున్నారామె. మరోవైపు వాషింగ్టన్ పోస్ట్ కూడా ఈ చిత్రాన్ని ‘అత్యంత స్ఫూర్తిదాయకమైన జర్నలిజం సినిమా ఇది’ అంటూ ప్రశంసల్లో ముంచెత్తింది.
గతేడాది జనవరి 30న విడుదలైన ఈ చిత్రం.. అంతర్జాతీయంగా ఎన్నో చిత్రోత్సవాల్లో ప్రదర్శితమైంది. వివిధ విభాగాల్లో 28 అంతర్జాతీయ అవార్డుల్ని సైతం అందుకుంది. ఇక ఇప్పుడు ప్రతిష్ఠాత్మక ఆస్కార్ బరిలోనూ నిలిచింది. మరి, ఇక్కడా ఇదే జోరును కొనసాగించి ఈ అత్యుత్తమ అవార్డు అందుకోవాలని మనమూ మనసారా కోరుకుందాం..!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- వార్థక్యపు ఛాయలు లేకుండా..!
- అమ్మో.. లిప్‌స్టిక్!
- ఫ్రిల్స్లో... బుట్టబొమ్మ!
- హెయిర్ బన్.. స్టైలిష్‌గా వేసేద్దాం!
- సన్‌స్క్రీన్... పౌడర్‌లో!
ఆరోగ్యమస్తు
- మండే ఎండల్లో.. డీహైడ్రేషన్‌కి గురి కాకుండా..!
- నిద్ర లేకపోయినా.. నీరసించిపోకుండా!
- ఇలా చేస్తున్నారా..!
- గుడ్డుకి బదులుగా..!
- నడకతో ఆల్జీమర్స్ పసిగట్టొచ్చు...!
అనుబంధం
- దాంపత్య బంధాన్ని పెంచే ‘1-1-1-1 రూల్’!
- అనుమానంతో.. నా ఫోన్ హ్యాక్ చేశాడా?
- అతను తగినవాడేనా?
- పోనీ ఇలా చెప్పి చూద్దామా?
- పెళ్లికి ముందు సరేనన్నాడు.. ఇప్పుడు వద్దంటున్నాడు!
యూత్ కార్నర్
- రూమ్మేట్తో గొడవలు రాకుండా..!
- ఆమె తిట్లకు ఏడ్చేశా..!
- Miss Universe : ఈ ముద్దుగుమ్మదే.. ఆ ఘనత!
- ఆ చక్రాలని నడిపించేది వాళ్లే!
- దాచగలరు..!
'స్వీట్' హోం
- వేసవిలో.. పండ్లు, కూరలు పాడవకుండా..!
- వేసవిలో.. ఇల్లు చల్లగా!
- గోవర్ధనాల గుబాళింపు!
- ఇనుప కడాయిలో ఇవొద్దు!
- Green Vegetables : వీటిని ఎలా వండుతున్నారు?
వర్క్ & లైఫ్
- అందుకే వీళ్ల ఎంగేజ్మెంట్ రింగ్స్.. ఎంతో స్పెషల్!
- ఒక్క రోజులోనే.. ఒంటరిగా.. ఆ ప్రాంతాలన్నీ చుట్టేశా!
- ఆ అల్లరి పిల్లే ఇప్పుడు టీచరైంది.. ఈ స్టూడెంట్-టీచర్ కథ చదివారా?!
- ప్రయాణాలకు... చిన్ని సాయాలు!
- ఆర్థికంగా ఎదగాలంటే...