తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు..!
'నాలో వూహలకు నాలో వూసులకు అడుగులు నేర్పావు...’ అన్నట్లు కొంతమందిని చూడగానే ఒక రకమైన మధుర భావన కలగడం సహజం. ప్రత్యేకించి యుక్త వయసులోకి ప్రవేశించాక ఇలాంటి ఫీలింగ్స్ మామూలే. అయితే ఒక వ్యక్తిని చూడగానే కలిగే ఇలాంటి మధుర భావన చిరకాలం మనసులో అలాగే ఉండిపోయి గాఢమైన ప్రేమగానూ రూపుదిద్దుకోవచ్చు.
'నాలో వూహలకు నాలో వూసులకు అడుగులు నేర్పావు...’ అన్నట్లు కొంతమందిని చూడగానే ఒక రకమైన మధుర భావన కలగడం సహజం. ప్రత్యేకించి యుక్త వయసులోకి ప్రవేశించాక ఇలాంటి ఫీలింగ్స్ మామూలే. అయితే ఒక వ్యక్తిని చూడగానే కలిగే ఇలాంటి మధుర భావన చిరకాలం మనసులో అలాగే ఉండిపోయి గాఢమైన ప్రేమగానూ రూపుదిద్దుకోవచ్చు. లేదంటే కేవలం తొలిచూపు ఆకర్షణగానే మిగిలిపోవచ్చు. తమకూ ఇలాంటి ఫస్ట్ క్రష్ ఫీలింగ్స్ ఉన్నాయంటున్నారు కొంతమంది అందాల తారకలు. వివిధ సందర్భాల్లో వాళ్లు పంచుకున్న ఆ ఆసక్తికర విశేషాలేంటో ఓసారి చూద్దామా..?
అనుష్క
వెండితెరపై తన అద్భుతమైన నటనతో అందరినీ మెప్పించే మన అందాల అనుష్కను ఒక క్రికెటర్ తన మాయలో పడేసుకున్నాడట! అతడే తన ఫస్ట్ క్రష్ అని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది స్వీటీ. 'రాహుల్ ద్రవిడ్ నా ఫేవరెట్ క్రికెటర్. అతని ఆటను చూస్తూ ఎదిగిన నేను ఒకానొక సమయంలో అతనితో ప్రేమలో కూడా పడిపోయా..' అని అతడిపై ఉన్న ప్రేమాభిమానాలను వెల్లడించింది అనుష్క.
రకుల్‌ప్రీత్ సింగ్..
ఇటు సిల్వర్ స్క్రీన్‌పై తన అందంతో మెరుపులు మెరిపిస్తూ.. అటు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ఎప్పుడూ టచ్‌లో ఉండడం ఎలాగో రకుల్‌ని చూసే నేర్చుకోవాలి. టాలీవుడ్ ఫిట్‌నెస్ ఫ్రీక్‌గా పేరు తెచ్చుకొన్న ఈ భామ ఒకసారి ట్విట్టర్ లైవ్ ఛాట్‌లో భాగంగా తన ఫస్ట్ క్రష్ గురించి నెటిజన్లతో పంచుకొంది. బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ అంటే తనకు వల్లమాలిన ప్రేమని, అతడే తన ఫస్ట్ క్రష్ అని చెప్పుకొచ్చింది.
సమంత..
తెలుగు ప్రేక్షకుల అభిమాన తారల్లో ఒకరిగా పేరు తెచ్చుకొన్న ఈ ముద్దుగుమ్మ స్కూల్లో ఉన్నప్పుడు తన క్లాస్‌మేట్‌ని ఇష్టపడేదట! ఆ తర్వాత కాలేజీ రోజుల్లో సూర్య అంటే పడి చచ్చిపోయేదట! 'ఎప్పుడూ కాలేజీలో జరిగే ఈవెంట్లకు వెళ్లని నేను ఒకసారి సూర్య ముఖ్య తిథిగా వస్తున్నారని తెలిసి అందరికంటే ముందే వెళ్లి.. మొదటి వరుసలో నిలబడ్డా..' అంటూ అతడిపై తనకున్న ఇష్టాన్ని వ్యక్తం చేసిందీ సుందరి.
రాశీఖన్నా..
బబ్లీ బ్యూటీగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి మంచి పేరు సాధించిన నటి మన అందాల 'రాశి'. 'తొలిప్రేమ' చిత్రంతో కథానాయికగా మెప్పించిన ఈ ముద్దుగుమ్మ ఒక ఇంటర్వ్యూలో తన తొలిప్రేమ గురించి కూడా మాట్లాడింది. 'ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న రోజుల్లో ఒక సీనియర్‌ని ఇష్టపడేదాన్ని. కానీ ఏనాడూ అతడికి ఆ విషయం చెప్పలేదు. ఒకరోజు అనుకోకుండా అతడే నా దగ్గరకి వచ్చి ప్రపోజ్ చేశాడు..' అంటూ సిగ్గుల మొగ్త్గెపోయిందీ అందాల బొమ్మ.
రెజీనా కసాండ్రా..
టాలీవుడ్ డస్కీ బ్యూటీ రెజీనా కూడా తన పక్కింట్లో ఉన్న ఓ వ్యక్తిని బాగా ఇష్టపడేదట! కానీ అతను మాత్రం తనవైపు కనీసం కన్నెత్త్తెనా చూసేవాడు కాదని ఓ కార్యక్రమంలో భాగంగా తన ఫస్ట్ క్రష్ ముచ్చట్లను పంచుకుంది అందాల రెజీనా.
తమన్నా..
మిల్కీ బ్యూటీ తమన్నాని ఆరాధించే అభిమానుల సంఖ్య లక్షల్లోనే అని చెప్పుకోవచ్చు. అలాంటి మన తమ్మూ కూడా స్కూల్లో చదివే రోజుల్లో ఒక వ్యక్తిని ఇష్టపడిందట! 'స్కూల్లో చదివే రోజుల్లో నా స్నేహితురాలి అన్నయ్యని ఎంతగానో ఇష్టపడేదాన్ని. అతను వయసులో నా కంటే చాలా పెద్దవాడు. మేమంతా తరచూ కలుస్తూనే ఉండేవాళ్లం. కానీ నా ప్రేమ విషయం ఎప్పుడూ అతనికి చెప్పలేదు..' అంటూ తన తొలిప్రేమ అనుభవాలు పంచుకుందీ బ్యూటీ.
మెహరీన్..
ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే వరుస హిట్లతో టాప్ హీరోయిన్లలో ఒకరిగా మారిపోయింది మెహరీన్. ఈ అమ్మడికి కండలవీరుడు సల్మాన్‌ఖాన్ అంటే చాలా ఇష్టమట! 'కాలేజ్‌లో చదువుకునే రోజుల్లో సల్మాన్‌ఖాన్ అంటే పడిచచ్చిపోయేదాన్ని. ఒకసారి బాడీగార్డ్ సినిమా షూటింగ్ జరుగుతుండగా ఆయన్ని కలిశా. అప్పుడు నేను ఇంటర్ చదువుతున్నా. ఆరోజును ఎప్పటికీ మర్చిపోలేను.' అంటూ తన తొలిప్రేమ అనుభూతులను పంచుకుందీ ముద్దుగుమ్మ.
సాయిపల్లవి..
తనదైన నటనతో, డ్యాన్స్‌తో అందరి హృదయాలనూ కొల్లగొట్టిన బ్యూటీ సాయిపల్లవి. అయితే మన 'మలర్' హృదయాన్ని మాత్రం ఓ స్టార్ హీరో మాయ చేశాడట! 'తమిళ నటుడు సూర్య అంటే నాకు చాలా ఇష్టం. తన చూపులు, నటనతోనే నన్ను మాయ చేసేశాడు..' అంటూ అతనిపై ఉన్న ఇష్టాన్ని చాలా సందర్భాల్లో పంచుకుంది ఈ బ్యూటీ. ప్రేమ, ఫస్ట్‌క్రష్ విషయాలు ఎలా ఉన్నా, తను పేరెంట్స్‌ని చూసుకోవడం కోవడం కోసం తను మాత్రం పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదని ఓ సందర్భంలో చెప్పిన విషయం తెలిసిందే.
అదాశర్మ..
తొలిచిత్రంతోనే కుర్రకారు మదిలో గిలిగింతలు పుట్టించిన అందాల భామ అదాశర్మ. ఈ అమ్మడికి కూడా హాలీవుడ్ హీరో లియోనార్డో డికాప్రియో అంటే చెప్పలేనంత ఇష్టమట. 'లియోనార్డో అంటే నాకు మాటల్లో చెప్పలేనంత ఇష్టం. అతడి కోసమే టైటానిక్ సినిమా దాదాపు పదిసార్లు చూశా..' అంటూ ఓ కార్యక్రమంలో తన ఫస్ట్ క్రష్ గురించి చెప్పుకొచ్చిందీ అందాల భామ.
గ్రీకు వీరుడే.. రాకుమారుడు!
'కహో నా ప్యార్ హై' చిత్రంతో ఎందరో అమ్మాయిల కలల రాకుమారుడిగా మారిపోయాడు హ్యాండ్‌సమ్ హీరో హృతిక్ రోషన్. ఈ జాబితాలో పలువురు బాలీవుడ్ ముద్దుగుమ్మలు సైతం ఉన్నారు. బాలీవుడ్ ఫ్యాషనిస్టా సోనమ్ కపూర్ తన ఫస్ట్ క్రష్ హృతికే అంటూ, 'కహో నా ప్యార్ హై' సినిమాలో రోహిత్ పాత్రలో నటించిన తనని చూసి ప్రేమలో పడిపోయినట్లు కొన్ని సందర్భాల్లో చెప్పుకొచ్చింది. అలాగే బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ దగ్గరైతే హృతిక్ ఫొటోలకు సంబంధించిన కలెక్షన్ కూడా ఉందట! ఈ జాబితాలో అందాల తార సోనాక్షీ సిన్హా, తాప్సీ మొదలైనవారు కూడా ఉన్నారండోయ్!
పరిణీతి చోప్రా
బాలీవుడ్ స్టార్ పరిణీతి చోప్రాకు పటౌడీ కా నవాబ్ సైఫ్ అలీ ఖాన్ అంటే వల్లమాలిన ప్రేమ. ఓసారి కాఫీ విత్ కరణ్ కార్యక్రమానికి విచ్చేసిన పరి.. సైఫ్‌కి పెళ్త్లెనా తనని వివాహం చేసుకోవడానికి ఇప్పుడూ నేను సిద్ధంగా ఉన్నానంటూ తన తొలిప్రేమ కబుర్ల గురించి చెప్పుకొచ్చిందీ అందాల తార.
అలియా భట్
RRR సుందరి అలియా భట్‌కి ముందు నుంచీ రణ్‌బీర్ కపూర్ అంటే పిచ్చి ప్రేమ. 'నేను ఎప్పటికీ రణ్‌బీర్‌ని ప్రేమిస్తూనే ఉంటా. 'బర్ఫీ'లో ఆయన్ని చూసిన దగ్గర్నుంచి ఆయనపై నా ప్రేమ మరింతగా పెరిగింది. రణ్‌బీర్ నాకు అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ నా బిగ్గెస్ట్ క్రష్..' అంటూ ఎన్నో సందర్భాల్లో చెప్పుకొచ్చింది. అలియానే కాదు.. ఇలా రణ్‌బీర్‌ని చూసి మనసు పారేసుకున్న ముద్దుగుమ్మల్లో.. జాన్వీకపూర్, దిశా పటానీ, సాయేషా సైగల్, సారా అలీ ఖాన్‌లు కూడా ఉన్నారట.
కత్రినా కైఫ్
మన అందాల తార కత్రినా కైఫ్‌కి బ్రిటిష్ నటుడు రాబర్ట్ పాటిన్సన్ అంటే అమితమైన ఇష్టమట. ఓ సందర్భంలో తన ఫస్ట్ క్రష్ గురించి మాట్లాడుతూ.. 'రాబర్ట్ అంటే నాకు ఎంతిష్టమో మాటల్లో చెప్పలేను. ప్రతి వ్యక్తిని, వస్తువును ఎంతో ప్రేమగా చూస్తాను నేను.. కానీ ఇప్పటిదాకా నన్ను ఇంత ప్రభావితం చేసిన వ్యక్తిని మునుపెన్నడూ చూడలేదు..' అని చెప్పుకొచ్చింది క్యాట్.
అదితీ రావ్ హైదరి
బాలీవుడ్ చిత్ర దర్శకుడు ఫర్హాన్ అక్తర్ అంటే మన అదితికి చాలా ఇష్టమట. 'ఫర్హాన్ ఎంతో అద్భుతమైన వ్యక్తి. ఎంతో కూల్‌గా, హుందాగా వ్యవహరిస్తుంటారాయన. తనలో నచ్చే ఈ క్వాలిటీసే తనపై నాకు ఫస్ట్ క్రష్ కలిగేలా చేశాయి’ అంటూ తన తొలిప్రేమ ముచ్చట్లు చెప్పుకొచ్చింది అదితి.
దీపికా పదుకొణె
టైటానిక్ హీరో లియోనార్డో డీ కాప్రియో అంటే మన బాలీవుడ్ ముద్దుగుమ్మ దీపికా పదుకొణెకు చాలా ఇష్టమట. టీనేజ్‌లో ఉన్నప్పుడు తన బెంగళూరు ఇంట్లోని తన గదిలో గోడలపై లియోనార్డో ఫొటోలు, వాటి పక్కనే తాను వివిధ స్టిల్స్‌లో దిగిన ఫొటోల్ని అమర్చుకునేదట! ఇలా ఆ గదినంతా ఆయన ఫొటోలతో నింపుకొని తన ప్రేమను చాటుకుందీ ముద్దుగుమ్మ.
మరి, మన అందాల తారలు పంచుకున్న తొలి ప్రేమ ముచ్చట్లు తెలుసుకున్నారుగా! ఇంతకీ మీ ఫస్ట్ క్రష్ విశేషాలేంటి? మీకూ ఇలా తొలిసారి ఎవరిని చూడగానే మీ మదిలో ప్రేమ గంట మోగింది? contactus@vasundhara.net ద్వారా పంచుకోండి. 'వేలంటైన్స్ డే' సందర్భంగా ఆ మధురమైన జ్ఞాపకాల్ని మరోసారి నెమరువేసుకోండి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.