ఫాదర్స్‌డే వెనక... ఓ అమ్మాయి!

మనకోసం...మన ఎదుగుదల కోసం నిరంతరం శ్రమించి, తపించే తండ్రికి ఏం చేసి రుణం తీర్చుకోగలం. అటువంటి నాన్నప్రేమకు గుర్తుగా జరుపుకొనే తీయని వేడుకే ఈ పితృదినోత్సవం.

Published : 16 Jun 2024 03:55 IST

మనకోసం...మన ఎదుగుదల కోసం నిరంతరం శ్రమించి, తపించే తండ్రికి ఏం చేసి రుణం తీర్చుకోగలం. అటువంటి నాన్నప్రేమకు గుర్తుగా జరుపుకొనే తీయని వేడుకే ఈ పితృదినోత్సవం. అసలు దీన్ని సెలబ్రేట్‌ చేసుకోవాలనే ఆలోచన మొదటగా వచ్చింది ఎవరికో తెలుసా? ఇంకెవరికీ... నాన్నను అమితంగా ఇష్టపడే ఓ కూతురికే! ఆ కథేంటో చదివేయండి.

మొట్టమొదటగా పితృదినోత్సవాన్ని 1910లో జూన్‌ 19న యూఎస్‌లో జరుపుకొన్నారు. సొనోరా స్మార్ట్‌ డాడ్‌ అనే అమ్మాయి తన తండ్రి విలియం జాక్సన్‌ స్మార్ట్‌ కోసం ఈ వేడుకను ప్రారంభించింది. ఆయన సైనికుడు. తల్లి చిన్నప్పుడే చనిపోతే... ఆరుగురు బిడ్డలనూ కంటికిరెప్పలా కాచుకుని పెంచి పెద్దచేశాడట. అందుకే, తమకోసం కష్టపడ్డ నాన్నకోసం సొనోరా ఏమైనా చేయాలనుకునేదట. అప్పుడే అనా జార్విస్‌ మాతృదినోత్సవాన్ని జరుపుతున్న విషయం తెలుసుకుంది. బిడ్డలకోసం పరితపించే నాన్నలూ, తండ్రి స్థానంలో ఉండి బాగోగులు చూసుకున్న మగవాళ్ల గౌరవార్థం తాను ఫాదర్స్‌డే జరపాలని నిర్ణయించుకుంది. తన తండ్రి విలియం పుట్టినరోజు జూన్‌ 5న దీన్ని నిర్వహించాలని పాస్టర్‌కు సూచించింది. కానీ, ఏర్పాట్లకు తగినంత సమయం లేకపోవడంతో జూన్‌ మూడో ఆదివారాన్ని ఫాదర్స్‌డేగా చేసుకున్నారట. మొదట్లో దీనికి అంతగా ప్రాచుర్యం లభించలేదట. దాంతో సొనోరా దేశమంతా అవగాహన కార్యక్రమాలు చేపట్టి, అందరికీ తెలిసేలా కృషిచేశారు. చివరగా ప్రెసిడెంట్‌ రిచర్డ్‌ నిక్సన్‌ దీన్ని జాతీయ సెలవుదినంగా ప్రకటించారట.  

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్